Nara Bhuvaneswari: నన్ను మేడం అని పిలవవద్దు.. నేను మీ భువనమ్మను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి.. నారా భువనేశ్వరి.. తాను దత్తత తీసుకున్న కృష్ణా జిల్లా కొమరువోలు గ్రామంలో ఈ రోజు పర్యటించిన ఆమె.. గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నన్ను మేడం అని పిలవవద్దు.. నేను మీ భువనమ్మను అని వ్యాఖ్యానించారు.. ఇక, కొమరవోలు రావడం సంతోషంగా ఉందన్న ఆమె.. ఈ గ్రామాన్ని ఎప్పుడూ మర్చిపోను.. ప్రజలు చిన్న చిన్న సమస్యలు నా దృష్టికి తెచ్చారు.. ఇచ్చిన హామీలతో పాటు సమస్యలన్నింటిని.. ముఖ్యమంత్రి చంద్రబాబు పరిష్కరిస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. గ్రామంలో విభేదాలు ఉంటే మాట్లాడుకొని పరిష్కరించాలి… వర్గాలను పక్కన పెట్టండి. గ్రామస్తులందరూ కుటుంబం మాదిరి కలిసి ఉండండి అని సూచించారు.
Read Also: PNB SO Recruitment 2025: బీటెక్ పాసై ఖాళీగా ఉన్నారా?.. ఈ జాబ్స్ మీకోమే.. నెలకు రూ. లక్ష జీతం
ఇక, ఒకరికి భయపడి గ్రామస్తులు తల దించుకోవాల్సిన అవసరం లేదు.. పుట్టిన గ్రామానికి.. మనమందరం కలిసి మంచి చేసుకుందాం.. గ్రామంలో ఇంకా చాలా మంచి కార్యక్రమాలు నిర్వహిద్దాం.. అని పిలుపునిచ్చారు నారా భువనేశ్వరి.. అయితే, గత ఐదేళ్లుగా గ్రామంలో కనీసం రోడ్ల మరమ్మత్తులు కూడా చేయలేదని భువనేశ్వరి దృష్టికి తీసుకెళ్లారు గ్రామస్తులు. గత ఐదేళ్లుగా సున్నా వడ్డీ రావడం లేదని డ్వాక్రా సంఘాల మహిళలు తమ గోడు వెల్లబోసుకున్నారు.. మరోవైపు, కష్టాలను ఒరిమితో… సహన శిలివై పూలబాటలో నడిచిన భూమాత భువనేశ్వరమ్మ అంటూ రచించిన కవిత్వాన్ని కానుకగా అందించారు లక్ష్మీస్వరి అనే మహిళ.. భువనమ్మను చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. దత్తత తీసుకున్న తర్వాత గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. సీఎం చంద్రబాబు, భువనేశ్వరిలపై తమకు ఎంతో నమ్మకం ఉంది. కొమరవొలు ప్రజలు భువనేశ్వరి సేవలను తరతరాలుగా గుర్తించుకుంటారు. ప్రజల తరఫున భవనమ్మకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు పామర్రు ఎమ్మెల్యే కుమార్ రాజా.