CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. వరుస ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు.. ఇవాళ ఢిల్లీలో కేంద్ర హౌసింగ్, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో సమావేశం అయ్యారు చంద్రబాబు.. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి కోసం వివిధ కేంద్ర పథకాల కింద సహాయం చేయాలని కోరినట్టుగా తెలుస్తోంది.. ఇక, వైజాగ్, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్ట్ లకు కేంద్ర సహాయం విషయంపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్టుగా సమాచారం.. దేశంలో మెట్రో రైలు ప్రాజెక్ట్ అభివృద్ధి కోసం కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు చేసిన నేపథ్యంలో.. దీనిని దృష్టిలో పెట్టుకుని, ఏపీలో మెట్రో రైలు ప్రాజెక్టులను త్వరితగతిన చేపట్టాలనే ఆలోచనలో ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నారు.. అందుకే కేంద్ర మంత్రిని కలిసి.. రెండో నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టుల విషయాన్ని వివరించారట.. ఇక, ఏపీలో పట్టణ ప్రాంతాల్లోని పేదలకు గృహాలను పెద్ద ఎత్తున కేటాయించాలని కేంద్ర మంత్రిని కోరారట సీఎం చంద్రబాబు.. మొత్తంగా కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ – ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మధ్య అరగంటకు పైగా సమావేశం జరిగింది.. మరోవైపు.. ప్రగతి మైదాన్ లోని “భారత్ మండపం”లో రాత్రి 8 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీకానున్నారు సీఎం చంద్రబాబు..
Read Also: YS Jagan: ఎక్కడా రాజీ పడొద్దు.. పార్లమెంట్‌లో గట్టిగా గళమెత్తండి.. ఎంపీలకు జగన్ దిశానిర్దేశం