Tirupati Laddu Case: టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం..
- టీటీడీ కల్తీ నెయ్యి ఘటనలో కీలక పరిణామం..
- కల్తీ నెయ్యి కేసును ఏసీబీ కోర్టుకు బదిలీ చేయాలని సిట్ పిటిషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirupati Laddu Case: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులు పవిత్రంగా భావించే.. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం సంచలనం సృష్టించింది.. అయితే, ఈ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ ఘటనలో టీటీడీ ఉద్యోగుల అవినీతిపై దృష్టి సారించింటి సిట్.. ఇక, కల్తీ నెయ్యి కేసును ఏసీబీ కోర్టుకు బదిలీ చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సిట్ బృందం.. అయితే, సిట్ నిర్ణయంతో టీటీడీ అధికారులో ఆందోళన మొదలైంది.. మార్కెటింగ్ విభాగంలో పనిచేసి ఆక్రమాలుకు పాల్పడిన అధికారులుపై చర్యలకు సిద్ధం అవుతోంది సిట్.. కల్తీ నెయ్యి కేసు విచారణను నెల్లూరు ఏసీబీ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలంటూ సిట్ అధికారులు తిరుపతి 2వ ఏడీఎం కోర్టులో పిటిషన్ వేశారు..
Read Also: Cyclone: కోల్‌కతాకు తుఫాన్ ముప్పు.. మరో 18 రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరిక
Also Read
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి నెయ్యి సరఫరా టెండర్లు దక్కించుకున్న ఏఆర్ డెయిరీ నాణ్యత లేని నెయ్యిని సరఫరా చేసిందన్న ఆరోపణలపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రిమినల్ కేసులో స్థానిక 2వ ఏడీఎం కోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే కాగా.. మంగళవారం సిట్ అధికారులు ఈ కేసును నెల్లూరులోని ఏసీబీ కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ పిటిషన్ ఫైల్ చేశారు. అయితే, నెయ్యి వినియోగం, నాణ్యత పరీక్షల అంశంలో టీటీడీ పరిస్థితి కాస్త ఇబ్బందిగా మారింది. ఇటీవల ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన ఆధునిక పరికరాలతో పరీక్షకు ఎక్కువ సమయం పడుతుండటంతో, ప్రసాదాల తయారీకి సకాలంలో నెయ్యి అందించలేకపోతోంది. తిరుమల ల్యాబ్‌లోనే నెయ్యి నాణ్యతను వంద శాతం పరీక్షించే పరికరాలను ఏర్పాటు చేసుకోవాలని టీటీడీ భావించింది. నూతన పరికరాలు కావడంతో సూక్ష్మస్థాయిలో పరీక్షించేందుకు అధిక సమయం పడుతున్నట్టు తెలిసింది. అయితే, కల్తీ నెయ్యి కేసు ఏసీబీ కోర్టుకు బదిలీ చేయాలని సిట్ పిటిషన్ దాఖలు చేయగా.. వాదనలు విన్న కోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది..
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!