Andhra Pradesh: ఓ ఉపాధ్యాయుడు గుంజీలు తీయడం, పొర్లు దండాలు పెట్టడం వైరల్‌గా మారిపోయింది.. అదేంటి..? ఎక్కడైనా విద్యార్థులతో ఉపాధ్యాయుడు గుంజీలు తీయిస్తాడు.. కానీ, ఆయనే గుంజీలు ఎందుకు తీశారు..? పైగా క్షమాపణలు ఎందుకు చెప్పారు.. అనేది చర్చగా మారింది.. అసలు విషయం ఏటంటే.. ఈ రోజుల్లో పెద్దలు, పిల్లలు అనే తేడా లేకుండా.. స్మార్ట్‌ఫోన్లతో గడిపేస్తున్నారు.. టీవీలకు ఎగబడుతున్నారు.. అందేకాదు.. ఉపాధ్యాయుడు మంచి మాటలు చెబితే.. పట్టించుకోవడం తర్వాత సంగతి.. ఎదురు తిరగడం.. మరోవైపు.. మా పిల్లలపై మీరు వ్యవహరించిన తీరు సరిగా లేదంటూ.. పిల్లల తల్లిదండ్రులు కూడా ఉపాధ్యాయులను తప్పుబడుతోన్న ఘటనలు ఎన్నో ఉన్నాయి.. ఈ నేపథ్యంలోనే.. మీకు మేం ఏమీ చేయలేకపోతున్నాం.. అందుకే నన్ను నేనే శిక్షంచుకుంటున్నాను అంటూ.. ఉపాధ్యాయుడుచేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది..
Read Also: Malavika : మీరు వర్జినా? నేరుగా ఆ స్టార్ హీరోయిన్‌ని క్వశ్చన్ చేసిన నెటిజన్
విజయనగరం జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బొబ్బిలి మండలం పెంటగ్రామలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు రమణ ఆవేదన ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది.. పిల్లలు ఏమీ చదవడం లేదని.. అక్షరం ముక్క కూడా రావట్లేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆ ప్రభుత్వ టీచర్.. మీకు మేము ఏమీ చేయలేకపోతున్నందుకు నాకు నేనుశిక్షించుకుంటున్నానంటూ.. పిల్లలను క్షమాపణ కోరుతూ మేం ఏమి చేయలేం నిస్సహాయ స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు.. ప్రస్తుత రోజుల్లో పిల్లలకు చదువు రాకపోతే వాళ్లకి బుద్ధి నేర్పే పద్ధతిలో మేం చెప్తే మా పైన అధికారులు, తల్లిదండ్రులు చర్యలు తీసుకుంటున్నారు.. మేం ఏమి చేయాలో తోచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.. మమ్మల్ని క్షమించండి అంటూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దండం పెట్టారు.. స్టేజ్‌పై గుంజీలు తీశారు.. మీకు మేం ఏమీ చేయలేకపోతున్నందుకే ఈ విధంగా గుంజీలు తీసున్నానని పేర్కొన్నారు.. మేం కొట్టలేం.. తిట్టలేం.. ఏమీ చేయలేం.. మీ దగ్గర చేతకాని వారిలాగా చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.. అంటూ ఆ హెచ్‌ఎం చేసిన వ్యాఖ్యలు.. ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతున్నాయి.. దీంతో.. ఆ వీడియో కాస్తా ఇప్పుడు వైరల్ అవుతోంది..