AP Assembly Session: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మరో కీలక చట్ట సవరణ బిల్లుకు ఆమోద ముద్ర వేసింది.. ఏపీ భూ హక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాల చట్ట సవరణకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.. అప్పిలేట్ అథారిటీని జిల్లా రెవెన్యూ అధికారుల నుంచి ఆర్డీవోలకు మారుస్తూ చట్టసవరణ చేశారు… చట్టసవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్.. 4 లక్షలకు పైగా భూవివాదాల అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు మంత్రి… చట్టసవరణ వల్ల అప్పీళ్లు త్వరితగతిన క్లియర్ అవుతాయని స్పష్టం చేశారు.
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
ఇక, ఏపీ శాసన సభలో టిడ్కో ఇళ్ళ లబ్దిదారుల మార్పు… రాష్ట్రంలో వలసలు… బిల్లుల చెల్లింపులో అక్రమాలు.. ఆంధ్ర విశ్వ విద్యాలయాలయంలో అక్రమాలు.. విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టు తదితర అంశాలపై ప్రశ్నోత్తరాలు కొనసాగుతాయి. ఇంధన రంగంపై శాసన సభలో చర్చ జరిగింది.. అయితే, 2024 ఆంధ్ర ప్రదేశ్ భూమి హక్కుల పట్టాదారు పాసు పుస్తకము సవరణ బిల్లును రెవెన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్ సభలో ప్రవేశ పెట్టడం.. ఏపీ భూహక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాల చట్ట సవరణకు అసెంబ్లీ ఆమోదం తెలపడం జరిగిపోయాయి.. అప్పిలేట్ అథారిటీని జిల్లా రెవెన్యూ అధికారుల నుంచి ఆర్డీవోలకు మారుస్తూ చట్టసవరణ చేశారు..