CM Chandrababu: ఇవాళ చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో జీడీ నెల్లూరులోని రామానాయుడు పల్లెకు చేరుకోనున్నారు. జీడి నెల్లూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు లబ్ధిదారులకు అందివ్వనున్నారు సీఎం.
AP Inter Exams: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్స్ ఈరోజు (మార్చ్ 1) ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. అయితే, ఉదయం 8.30 గంటల నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. ఇక, తొలి రోజు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి ద్వితీయ భాషపై పరీక్ష జరగనుంది.
Posani Krishna Murali: పోసాని కృష్ణ మురళిని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. రైల్వే కోడూరు కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేసిన ఓబులవారిపల్లె పోలీసులు.. పోసానిని సమగ్ర విచారణ చేయాల్సి ఉందని పిటిషన్ లో వెల్లడి.
ట్రాఫిక్ అధికారులు ట్రాఫిక్ రూల్స్ గురించి అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొందరు వాహనదారులు ఉల్లంఘనలకు పాల్పడుతుంటారు. హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం, రాంగ్ రూట్ లో వెళ్లడం, ట్రిపుల్ రైడింగ్, ఓవర్ స్పీడ్, సిగ్నల్ జంపింగ్ లకు పాల్పడుతూ ప్రమాదాలకు కారణమవుతుంటారు. ఇలాంటి వారికి భారీగా జరిమానాలు విధించినప్పటికీ ఏ మాత్రం మార్పురావడం లేదు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ డిపార్ట్ మెంట్ అధికారులు కఠినమైన రూల్స్ తీసుకొస్తున్నారు. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుంచి కొత్త…
CM Chandrababu: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు (మార్చ్ 1వ తేదీన) చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు.
Nadendla Manohar: సమగ్రాభివృద్ధి, ప్రజా సంక్షేమానికి భరోసా కల్పించేలా బడ్జెట్ ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. మూల ధన వ్యయం పెంపుతో భవిష్యత్తుకు బాటలు వేశారు. వసతుల కల్పన, పెట్టుబడుల ఆకర్షణకు అద్భుత అవకాశం.. సూపర్ సిక్స్ పథకాల అమలు దిశగా కేటాయింపులు జరిగాయి..
Minister Narayana: గత ప్రభుత్వానికి ఆర్థిక క్రమ శిక్షణ లేదు అని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. మున్సిపల్ శాఖలో ఉన్న నిధులు గత ప్రభుత్వం డైవర్ట్ చేసింది అని ఆరోపించారు.
చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా జీతాలు సరిగ్గా రావు అని మాజీ మంత్రి బుగ్గన అన్నారు. చంద్రబాబును ఓ చాణక్యుడు, కౌటిల్యుడు అని పోల్చారు.. మరి నాకు తెలిసి ఆయనకు ఏదీ సూట్ కాదు.. ఈసారి బడ్జెట్ కూడా సిస్టమాటిక్ గా పొందుపరచలేదు..
ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజాహిత బడ్జెట్ అన్నారు. కమలం వాణి ఎప్పుడూ ప్రజా వాణి.. సమస్యలపై స్పందించడం, ప్రజల మాట వినిపించడం మా పార్టీ విధానం.. రాజకీయంలో మచ్చలేని పార్టీ బీజేపీ అని చెప్పగలం.. వేలెత్తి చూపలేని పార్టీగా మోడీ పాలనలో బీజేపీ ఉందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పేర్కొన్నారు.