కడప మేయర్ సురేష్‌బాబుపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే మాధవి.. అవినీతి అక్రమాలకు పాల్పడిన మేయర్ సురేష్ బాబు పై చర్యలు తప్పవని హెచ్చరించారు.. అధికారం ఉందని అవినీతికి పాల్పడితే సహించేది లేదన్నారు. మేయర్ అవినీతి అక్రమాలు చేశారని ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్ నోటీసుకు ఆయన సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిసాయి.. దీంతో, తీర్పు రిజర్వ్ చేసింది సీఐడీ కోర్టు.. అయితే, వల్లభనేని వంశీ బెయిల్‌పై ఈ నెల 27వ తేదీన తీర్పు ఇవ్వనుంది సీఐడీ న్యాయస్థానం..
కలెక్టర్లకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కలెక్టర్లు జిల్లా ముఖ్య నిర్వహణా అధికారులు అన్నారు సీఎం చంద్రబాబు. ఏసీ రూమ్‌లకు కలెక్టర్లు పరిమితం కావద్దన్నారు.. రెండు రోజుల కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు అన్ని విషయాలు ప్రస్తావించారు... విజన్ 2047పై ప్రధానంగా కలెక్టర్లు దృష్టి పెట్టాలన్నారు.. పెన్షన్లను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అన్నారు..
ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న నిరుద్యోగులకు శుభావార్త చెబుతూ.. ఏప్రిల్ మొదటి వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందని తెలిపారు సీఎం చంద్రబాబు.. వేసవి సెలవుల తర్వాత స్కూళ్లు రీ ఓపెన్ అయ్యే సమయానికి ఉపాధ్యాయులు పోస్టింగుల్లో ఉండాలని కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు సీఎం చంద్రబాబు.
మాజీ సీఎం జగన్ తన స్ట్రాటజీలు మారుస్తున్నారట.. పార్టీతో పాటు పార్టీ కార్యాలయాల్లోనూ కీలక మార్పులు చేపట్టబోతున్నారట.. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే ఆ కీలక మార్పులను చూడవచ్చంటున్నారట..
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తిలోని రుస్తుం మైన్స్ నుంచి అక్రమంగా క్వార్ట్జ్ ఖనిజాన్ని తరలించారనే ఆరోపణలతో కాకాని గోవర్ధన్ రెడ్డిపై.. పోలీసులు కేసు పెట్టారు.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రుస్తుం మైన్ నుంచి దాదాపు 250 కోట్ల రూపాయల విలువైన క్వార్ట్జ్ ను అక్రమంగా తరలించారని అప్పట్లో వివాదం చెలరేగింది.
రాజధాని అమరావతి పునఃనిర్మాణం వైపు వేగంగా అడుగుల వేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వచ్చే నెల మూడో వారంలో ప్రధాని మోడీ రాజధాని రీ లాంచ్ కార్యక్రమానికి వస్తారని తెలిపారు మంత్రి నారాయణ.. సీఎం చంద్రబాబు త్వరలోనే ప్రధానితో సమావేశం అవుతారన్నారు.. రాజధాని ప్రాంతంలో సెక్రెటరీ.. ప్రిన్సిపాల్ సెక్రెటరీ భవనాలు పరిశీలించిన మంత్రి నారాయణ.. ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శుల భవనాల నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు.. నిర్మాణంలో ఉన్న భవనాలు 115 కాగా.. సెక్రటరీలకు 90, ప్రిన్సిపల్ సెక్రెటరీలకు 25…
కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభం కానుంది.. వచ్చే ఏడాది నాటికి 15 శాతం వృద్ది సాధనే లక్ష్యంగా నేటి నుంచి రెండు రోజుల పాటు కలెక్టర్ల సదస్సు నిర్వహించనుంది ఏపీ ప్రభుత్వం.. సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో ఈ సదస్సు జరగనుంది.. గతానికి భిన్నంగా కలెక్టర్ల సదస్సు నిర్వహించడానికి సర్కార్ సిద్ధ
ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 25, 26 తేదీల్లో కలెక్టర్ సమావేశాలు జరుగనున్నాయి. రేపటి నుంచి రెండు రోజులపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం జరుగనున్నది. రేపు ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభంకానుంది. ఉదయం 10 గంటలకు సీసీఎల్ఏ ప్రారంభ ఉపన్యాసం జరుగనుంది. ఆ తర్వాత సీఎస్.. రెవెన్యు మంత్రి.. ఆర్ధిక మంత్రి ప్రసంగాలు ఉండనున్నాయి. Also Read:Rishabh Pant: రూ. 27 కోట్లు గంగలో కలిసినట్లేనా..? రిషబ్ పంత్ ప్లాప్ షో! తర్వాత…