విజయవాడలో మెప్మా వన్ డే వర్క్ షాప్ నిర్వహించారు. మహిళాకాశం పేరిట మెప్మా వెబ్ సైట్, మెప్మా మొబైల్ యాప్ ను మంత్రి నారాయణ ప్రారంభించారు. మహిళా వ్యాపారుల అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక లక్ష్యంతో వర్క్ షాప్ నిర్వహించారు. వన్ డే వర్క్ షాప్ కి మెప్మా డైరెక్టర్ తేజ భరత్, మంత్రి నారాయణ హాజరయ్యారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో 30 వేల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారుచేయడమే లక్ష్యంగా మెప్మా ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం ఉన్న పదివేల జీవనోపాధి యూనిట్లతో పాటు కొత్తగా 20 వేల జీవనోపాధి యూనిట్లను ఏర్పాటు చేసేందుకు మెప్మా ప్రణాళిక రూపొందించింది. తొమ్మిది రకాల జీవనోపాధి యూనిట్లను రూపొందించింది.
Also Read:Kunal Kamra: కునాల్ కమ్రాకు షాక్.. ‘‘బుక్ మై షో’’ నుంచి పేరు తొలగింపు
మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ.. ఇన్ని సంవత్సరాల తరువాత కూడా డ్వాక్రా సంఘాలు, మెప్మా డేటాను పర్ఫెక్ట్ గా ఉంచుకున్నారు.. ప్రభుత్వం నుంచి ఏం ఇవ్వాలన్నా డేటా పర్ఫెక్ట్ గా ఉండాలి.. ఈ రోజు ఐదు వెబ్‌సైట్ లు ప్రారంభించాం.. 2047 నాటికి ప్రతి ఇంట్లో ఒక వ్యాపారవేత్త వుండాలని సీఎం చంద్రబాబు లక్ష్యం.. గతంలో ఇసుక కాంట్రాక్టులు డ్వాక్రా గ్రూపులకు ఇచ్చారు.. కొన్ని అనివార్య కారణాలవల్ల అది అమలు జరుగలేదు.. 80 వేల సంఘాలకు 8 కోట్లు ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నాం.. 26 జిల్లాలలో మీటింగ్ లు పెట్టాలని అనుకుంటున్నాం.. 2029 నాటికి సాధ్యమైనంత మేరకు మహిళా పారిశ్రామికవేత్తలను తయారుచేస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు.