మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారట.. హైదరాబాద్లో ఉన్న కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు.. ఛాతిలో నొప్పిరావడంతో.. గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.
ఉమ్మడి కడప జిల్లా.. జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక వివాదం ఇప్పుడు హైకోర్టు వరకు చేరింది.. జడ్పీ చైర్మన్ ఎన్నికను వాయిదా వేయాలంటూ గోపవరం జడ్పీటీసీ జయరాం రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కడప జిల్లాలో ఖాళీగా ఉన్న రెండు జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని తన పిటిషన్లో పేర్కొన్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఇవాళ రెండో రోజు కలెక్టర్ల సమావేశం జరగనుంది. జిల్లాలో ఉన్న ప్రధాన సమస్యలను కలెక్టర్లు వివరించనున్నారు. ప్రతి కలెక్టర్ కు 10 నిమిషాల సమయం కేటాయిస్తారు.. రెవెన్యూ సమస్యలు.. ల్యాండ్ సర్వే.. మద్యం షాపులు.. జిల్లాలో పథకాల అమలుపై చర్చ జరగనుంది. వాట్సప్ గవర్నెన్స్, పీ4, జిల్లాలో పేదలకు ఇళ్ళ స్థలాలు, సోలార్రూఫ్ టాఫ్ లపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. READ MORE: Kunal Kamra: మధ్యప్రదేశ్లో కునాల్ కమ్రా పోస్టర్లు…
లేడీ అఘోరీగా చలామణి అవుతున్న అలియాస్ అల్లూరి శ్రీనివాస్ అనే వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఓ వ్యక్తి... తన కూతురు శ్రీ వర్షిణికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లి పోయాడని గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన తురిమెల్ల కోటయ్య.. మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
పేరుకుపోయిన ఆస్తి పన్ను బకాయిలను వసూలు చేసేందుకు ఏపీ మున్సిపల్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.. ఆస్తి పన్నుపై వడ్డీలో రాయితీ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు మున్సిపల్ శాఖ అధికారులు.. ఈ నెలాఖరు వరకు అంటే 31 ఏప్రిల్ 2025 దాకా పెండింగ్ ఉన్న వడ్డీ బకాయిల్లో 50 శాతం రాయితీ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ మున్సిపల్ శాఖ..
ఏపీలో లేని లిక్కర్ స్కాం పేరు చెప్పి కూటమి ప్రభుత్వం ఏదో ఒక రకంగా తప్పుడు ఆరోపణలతో మాజీ సీఎం వైఎస్ జగన్ ను అరెస్ట్ చేయాలని చూస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని.. ఎక్సైజ్ శాఖలో ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి గతంలో తనను బెదిరిస్తున్నారని హైకోర్టు న్యాయమూర్తులకు విన్నవించారని.. ఇప్పుడు ఆయనను బెదిరించి తప్పుడు స్టేట్మెంట్ లు తీసుకున్నారన్నారు. అమాయకుల పేర్లు చెప్పి ఏదో…
మంత్రి నారా లోకేష్ సమక్షంలో సిస్కో - ఏపీఎస్ఎస్ డీసీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.. ఒప్పందం ద్వారా 50 వేల మంది యువతకు డిజిటల్, ఐటీ నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇవ్వనున్నారు..
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ మోహన్కు మరోసారి షాక్ తగిలింది.. వంశీకి రిమాండ్ను ఏప్రిల్ 8వ తేదీ వరకు పొడిగించింది విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టు..