కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు మజ్లిస్‌కు బానిసలు.. ఇదే నిదర్శనం!
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు మజ్లిస్ పార్టీకి బానిసలుగా మారిపోయాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌ను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని, ఈ నగరాన్ని మజ్లిస్ పార్టీకి అప్పగించారని ఆరోపించారు. మజ్లిస్ పార్టీకి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. మజ్లిస్ మెప్పు కోసమే ఇతర పార్టీలు వారి అడుగులకు మడుగులు వత్తుతున్నాయని తెలిపారు. అన్ని పార్టీలు పోటీ చేస్తాయని భావించామని, కానీ రాహుల్ గాంధీ, కేసీఆర్‌లు పోటీ చేయకుండా మజ్లిస్‌కు ఏకగ్రీవం చేయాలని యత్నించారని కిషన్ రెడ్డి ఆరోపించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్లు మజ్లిస్‌కు అనుకూలంగా లేరని, అయితే మజ్లిస్ చేస్తున్న సంఘవిద్రోహ చర్యలను సమర్థించరని చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఓటర్లు తమ ఓటును ఆత్మసాక్షిగా వినియోగించాలని కోరారు. మజ్లిస్ పార్టీకి ఓటు వేస్తే ప్రజలు క్షమించరనిదని హెచ్చరించారు. మజ్లిస్ మద్దతు కోసమే బీఆర్‌ఎస్ పోటీ చేయడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లను వేర్వేరుగా చూడాల్సిన అవసరం లేదని, ఇవి రెండు కాదు ఒకటేనని స్పష్టం చేశారు. బీజేపీ నుంచి వెళ్లిపోయిన నేతలకు కూడా విజ్ఞప్తి చేస్తూ బీజేపీకి ఓటు వేయాలని కోరారు. అన్ని పార్టీలకు చెందిన కార్పొరేటర్లు బీజేపీకి మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
“2000 ఎకరాల్లో ఎకో పార్క్”.. కంచ గచ్చిబౌలి భూములపై మంత్రులు కీలక ప్రతిపాదన..
కంచ గచ్చిబౌలి భూములపై సీఎం రేవంత్రెడ్డికి మంత్రుల కీలక ప్రతిపాదన సమర్పించారు.. ఈ వ్యవహారంపై భేటీ అయిన మంత్రులు.. కంచ గచ్చిబౌలి భూముల్లో అతి పెద్ద ఎకో పార్క్ ఏర్పాటు చేయాలని సూచించారు. బర్డ్పార్క్, బట్టర్ఫ్లై గార్డెన్, తాబేళ్ల పార్క్, ఫ్లవర్ గార్డెన్ ఏర్పాటు, లేక్స్ అండ్ రాక్స్కు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.. ప్రభుత్వ భూమి 400 ఎకరాలతో పాటు మరో 1600 ఎకరాలు సేకరించాలని సూచించారు.. రాజీవ్ పార్క్గా పేరు పెట్టాలని ప్రతిపాదనలో తెలిపారు.. 2000 ఎకరాల్లో ప్రపంచస్థాయి ఎకో పార్క్ ఏర్పాటు చేయాని.. ప్రభుత్వ భూమి 400 ఎకరాల్లోనే కాకుండా హెచ్సీయూ 1600 ఎకరాలు కలిపి ఏర్పాటు చేయాలన్నారు… ఈ నిర్మాణం హైదరాబాద్కే తలమానికంగా మారుతుందన్నారు.
అంబేద్కర్ కేవలం దళిత నాయకుడు కాదు.. ప్రతి భారతీయుడు గర్వపడే వ్యక్తి
ప్రజల అందరికీ డాక్టర్ బాబు జగ్జీవన్ రాం జయంతి శుభాకాంక్షలు తెలిపారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీకాకుళం పట్టణంలో అభివృద్ధి జరగాలని అడుగులు ముందుకు వేస్తున్నాం.. అట్టడుగు కుటుంబం నుంచి దేశ ఉప ప్రధాని అయ్యారు.. అంటరానితం నిర్మూలనకు డాక్టర్ బాబు జగ్జీవన్ రాం కృషి చేశారు.. హరిత విప్లవం కోసం పరితపించారు.. విద్యాను ఆయుధంగా చేసుకొని ముందుకు వెళ్ళారు.. వెనుకబడిన వర్గాలకు కేవలం చదువే పరిష్కారం చూపుతుంది.. సంక్షేమ హాస్టల్స్ గత ఐదేళ్లుగా నిర్వీర్యం చేశారని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. ఇక, గత ప్రభుత్యం మాదిరి కక్షసాధింపు చర్యలతో జైళ్ళలో పెట్టాలని మేం ఆలోచించడం లేదు అని కేంద్రమంత్రి రామ్మోహన నాయుడు తెలిపారు. స్వేచ్చ, స్వాతంత్ర్యంతో వ్యవహరించేలా పని చేస్తున్నాం.. అయితే, అంబేద్కర్ కేవలం దళిత నాయకుడు కాదు.. ప్రతి భారతీయుడు గర్వపడే వ్యక్తి అని ఆయన కొనియాడారు.
వక్ఫ్ బోర్డులో మాత్రమే సవరణలు.. మతపరమైన అంశంలో కాదు..
నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం త్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370, పౌరసత్వ బిల్లు లాంటివి చేసింది అని బీజేపీ ఎంపీ పురంధేశ్వరి తెలిపింది. వక్ఫ్ సవరణ బిల్లు త్వరలో చట్టం అవుతుంది.. అప్రజాస్వామికంగా వక్ఫ్ సవరణ బిల్లు తెచ్చారని సోనియా గాంధీ అన్నారు.. సోనియా ఆ సమయంలో రాజ్యసభలో ఉన్నారో లేదో తెలీదు.. రాహుల్, ప్రియాంక కూడా కనిపించలేదని ఎద్దేవా చేసింది. 3వ తేదీన లోక్ సభలో, 4న రాజ్యసభలో పాస్ అయింది వక్ఫ్ బిల్లు.. దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల అభిప్రాయ సేకరణ చేయాలని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేశాం.. 92 లక్షలకు పైగా పిటిషన్స్ జేపీసీకి వచ్చాయి.. 25 రాష్ట్రాల నుంచి వక్ఫ్ బోర్డులు వాళ్ళ రిప్రెజెంటేషన్ ఇచ్చారు అని పురంధేశ్వరి చెప్పుకొచ్చింది.
రామానాయుడు స్టూడియో భూములపై షోకాజ్ నోటీసులు
విశాఖపట్నంలో వివాదాస్పదంగా మారిన రామా నాయుడు స్టూడియో భూములు స్వాధీనానికి రంగం సిద్దం అయింది. ప్రభుత్వ ఆదేశాలతో సురేష్ ప్రొడక్షన్స్ కు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నామని వైజాగ్ కలెక్టర్ హరేందిర ప్రసాద్ చెప్పారు. ఇక, షోకాజ్ నోటీసులకు వచ్చే రిప్లై ఆధారంగా పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. మధురవాడ సర్వే నెంబర్ 336/పీతో పాటు మరి కొన్ని నంబర్లలో 34.44 ఎకరాలను స్టూడియో, చిత్ర నిర్మాణ అవసరాల కోసం సురేష్ ప్రొడక్షన్స్ కోసం ప్రభుత్వం కేటాయించింది. అయితే, నిబంధనలకు విరుద్ధంగా రామా నాయుడు స్టూడియోస్ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగినట్టు ప్రభుత్వం గుర్తించింది.
శ్రీలంకలో మోడీకి ఘనస్వాగతం.. 3 రోజులు పర్యటన
ప్రధాని మోడీ శ్రీలంకలో పర్యటిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన శ్రీలంక చేరుకున్నారు. కొలంబోలోని ఇండిపెండెన్స్ స్క్వేర్ దగ్గర మోడీకి శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసానాయకే స్వాగతం పలికారు. బ్యాంకాక్‌లో జరిగిన బిమ్స్‌టెక్ శిఖరాగ్ర ససమావేశానికి మోడీ హాజరయ్యారు. అనంతరం అక్కడ నుంచి నేరుగా శ్రీలంకకు చేరుకున్నారు. మూడు రోజుల పాటు శ్రీలంకలో మోడీ పర్యటించనున్నారు. శ్రీలంక పర్యటనలో భాగంగా ముఖ్యంగా ఇంధనం, వాణిజ్యం, కనెక్టివిటీ, డిజిటలైజేషన్, రక్షణ రంగం, అలాగు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకునే అంశాలపై చర్చించనున్నారు. శనివారం అధ్యక్షుడు అనుర కుమార దిసానాయకేతో ప్రధాని మోడీ విస్తృత చర్చలు జరపనున్నారు.
హౌతీలపై జరిపిన దాడి వీడియోను పంచుకున్న ట్రంప్
గత కొద్ది రోజులుగా యెమెన్‌లో హౌతీ ఉగ్రవాదులపై అమెరికా భీకర దాడులు చేస్తోంది. ఇప్పటికే పదుల కొద్దీ హౌతీలు మరణించారు. తాజాగా అమెరికా మరో భీకర దాడి చేసింది. డజన్ల కొద్దీ హౌతీ ఉగ్రవాదులు మరణించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్రంప్ తన ట్రూత్ సోషల్ నెట్‌వర్క్‌లో పోస్ట్ చేశారు. ‘అయ్యో’ అంటూ వ్యాఖ్యానించారు. ‘‘అయ్యో, ఈ హౌతీలు దాడి చేయరు’, ‘‘వాళ్లు మళ్లీ మన ఓడలను ముంచివేయరు!.’’ అంటూ ట్రంప్ రాసుకొచ్చారు. ఎర్ర సముద్రంలో అమెరికా నౌకలు లక్ష్యంగా హౌతీ ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. ఇరాన్ మద్దతుతో ఈ హౌతీలు చెలరేగిపోతున్నారు. ఈ దాడులు అమెరికా వ్యాపారాలను భారీగా దెబ్బతీస్తున్నాయి. దీంతో అగ్రరాజ్యం ప్రతీకారంతో రగిలిపోతుంది. ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా హౌతీలు లక్ష్యంగా దాడులు చేస్తోంది. అయితే ఒక చోట హౌతీలంతా సమావేశమై చర్చించుకుంటుండగా అమెరికా భీకరమైన బాంబ్‌ను ప్రయోగించింది. అంతే ఒక్కసారిగా భారీ విస్ఫోటనం జరిగింది. ఆ ప్రదేశంలో పెద్ద గుంత ఏర్పడింది. అంతేకాకుండా వాళ్ల శరీరాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. విమానాల నుంచి తీసిన వీడియోలో.. ఆ సమీపంలో వాహనాలు నిలిపి ఉంచినట్లుగా కనిపిస్తోంది. అయితే ఈ హౌతీలంతా.. దాడులు చేసేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నట్లుగా సమాచారం. ఇంతలోనే ఊహించని దాడి జరగడంతో హతమయ్యారు.
మిచెల్‌తో విడాకులపై ఒబామా కీలక వ్యాఖ్యలు
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా-మిచెల్ దంపతులు విడిపోతున్నట్లు ఆ మధ్య కాలంలో జోరుగా ప్రచారం సాగింది. విడాకులు కూడా తీసుకోబోతున్నట్లు వదంతులు నడిచాయి. మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియలకు మిచెల్ హాజరుకాలేదు.. అనంతరం జనవరి 20న జరిగిన ట్రంప్ ప్రమాణస్వీకారానికి కూడా మిచెల్ హాజరుకాకపోవడంతో ఆ పుకార్లకు మరింత బలం చేకూర్చింది. ఇంత ప్రచారం జరిగినా వాళ్ల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. తాజాగా ఇదే అంశంపై ఒక ఇంటర్వ్యూలో ఒబామా నోరు విప్పారు. హామిల్టన్ కళాశాల అధ్యక్షుడు స్టీవెన్ టెప్పర్‌తో జరిగిన సంభాషణలో ఒబామా మాట్లాడుతూ.. భార్య మిచెల్‌తో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలిపారు. దీని నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. చాలా రోజుల నుంచి వైవాహిక బంధం ఒడిదుడుకులకు గురవుతున్నట్లు ఒబామా ఒప్పుకున్నారు.
రష్మిక మందన్న బర్త్ డే సెలబ్రేషన్స్.. ఎవరెవరు అటెండ్ అయ్యారు?
ప్రజంట్ వరుస విజయాలతో దూసుకుపోతోంది కన్నడ భామ రష్మిక. ‘పుష్ప’ ఫ్రాంఛైజీ, యానిమల్, ‘ఛావా’ ఈ మూడు చిత్రాలు ఆమెకు దేశవ్యాప్తంగా తిరుగులేని పాపులారిటీని తెచ్చిపెట్టాయి. ఓ దక్షిణాది కథానాయిక అనతికాలంలోనే ఈ స్థాయి పేరుప్రఖ్యాతులు దక్కించుకోవడం అరుదైన విషయం. ఇక రీసెంట్ గా బాలీవుడ్‌లో ‘సికంర్’ మూవీతో రాగా.. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘గర్ల్‌ఫ్రెండ్’, ధనుష్ తో కలిసి ‘కుబేర’, ‘తమా’ అనే హిందీ సినిమాలో రష్మిక లీడ్ రోల్ పోషిస్తోంది. అలాగే లేడీ ఓరియెంట్ మూవీ ‘రెయిన్‌బో’ లోనూ యాక్ట్ చేస్తోంది. వీటన్నిటితో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు రష్మిక చేతిలో ఉన్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా నిన్న శుక్రవారం (ఏప్రిల్ 05) రష్మిక పుట్టిన రోజు. దీంతో ఈ స్పెషల్‌డే కోసం ఆమె సినిమా షూటింగుల నుంచి కాస్త బ్రేక్ తీసుకొని విదేశాలకు వెళ్లింది. బిజీ షూటింగ్ షెడ్యూల్స్ నుంచి బ్రేక్ తీసుకున్న రష్మిక మందన్న ఇప్పటికే తన కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి ఓమన్ దేశం కు చేరుకుంది. ఫ్యామిలీ మెంబర్స్, కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో రష్మిక బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోనుందని సమాచారం. ప్రజంట్ ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు రివిల్ అవ్వగా అందులో రష్మిక మాత్రమే కనిపించింది. ఇంక ఎవ్వరెవ్వరు వెళ్లారు అనేది తెలియాల్సి ఉంది.
టాలీవుడ్ లో వరుస సినిమాలలో కోలీవుడ్ భామ
చైల్డ్ ఆర్టిస్ట్ నుండి హీరోయిన్‌గా మారిన మరో సోయగం అలీనా షాజీ అలియాస్ ఇవానా. లవ్‌టుడేతో కోలీవుడ్, టాలీవుడ్ యూత్ హార్ట్ థ్రోబ్ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ క్రేజ్‌ను తర్వాత సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయింది ఇవానా. పేలవమైన స్క్రిప్ట్ వల్ల ఆ తర్వాత వచ్చిన లెట్స్ గెట్ మారీడ్, మాతిమారన్, కాల్వన్ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బెడిసికొట్టాయి. కానీ మళ్లీ తన లక్కీ బాయ్ అయ్యాడు ప్రదీప్ రంగనాథ్. డ్రాగన్‌లో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చి మళ్లీ కెవ్వు కేక అనిపించింది ఇవానా. తమిళంలో కెరీర్ పరంగా మిక్స్ డ్ రిజల్ట్ చూసిన బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్ పై ఫోకస్ చేస్తోంది. ఎప్పుడో తెలుగు ఇండస్ట్రీ ఎంట్రీ ఖరారైనా ప్రాజెక్ట్ హోల్డ్ కావడంతో కాస్త ఆలస్యమైంది. దిల్ రాజు బ్యానర్‌లో ఆయన సోదరుడు కుమారుడు ఆశిష్ హీరోగా సెల్ఫిష్ అనే మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాతోనే ఇవానా టాలీవుడ్ తెరంగేట్రం చేయాల్సి ఉంది. కానీ ఈసినిమాకు సుకుమార్ రైటింగ్ ఇవ్వాల్సి ఉండగా పుష్ప 2 షూటింగ్ వల్ల సెల్ఫిష్ వాయిదా పడిందని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు దిల్ రాజు. అదే టైంలో గీతా ఆర్ట్ బ్యానర్ నుండి ఆఫర్ అందుకుంది అమ్మడు. టాలీవుడ్ యంగ్ అండ్ డైమనిక్ బాయ్ శ్రీ విష్ణు సరసన జోడీ కడుతోంది ఇవానా. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ప్రజెంటర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాను నిను వీడని నీడను నేను, నేనే నా ఫేం కార్తీక్ రాజు దర్శకుడురీసెంట్లీ సింగిల్ గ్లింప్స్, సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. మేలో సినిమాను థియేటర్లలోకి తీసుకు వచ్చేందుకు ప్రిపేర్ అవుతున్నారు.
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. దిగొచ్చిన గోల్డ్ రేట్స్
బంగారం ప్రియులకు శుభవార్త. బంగారం ధరలు దిగొస్తున్నాయి. గత కొద్ది రోజులుగా హడలెత్తించిన ధరలు.. రెండు రోజులుగా ఊరట కలిగిస్తున్నాయి. శనివారం కూడా భారీగానే ధరలు తగ్గాయి. దీంతో శుభకార్యాలు దగ్గర పడడంతో గోల్డ్ కొనేందుకు కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు. బులియన్ మార్కెట్‌లో శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.900 తగ్గి.. రూ.83,100గా కొనసాగుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.980 తగ్గి.. రూ.90,660గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరోవైపు వెండి ధరలు కూడా భారీగానే ఊరటనిస్తున్నాయి. వెండి ధరలు కూడా భారీగానే తగ్గాయి. నేడు రూ.5,000 తగ్గి.. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.94,000గా కొనసాగుతోంది.