బలభద్రపురంలో క్యాన్సర్ కేసులపై అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. బలభద్రపురంలో క్యాన్సర్ కేసులపై అధికార యంత్రాంగం ఇకనైనా వాస్తవాలు గ్రహించాలని అన్నారు. గ్రామంలో 1,295 మందిని పరీక్ష చేస్తే 62 క్యాన్సర్ కేసులు వచ్చాయని తెలిపారు. సాధారణ కంటే మూడు రేట్లు అధికంగా బిక్కవోలు గ్రామంలో కేసులు నమోదు అవుతున్నాయన్నారు. జాతీయ క్యాన్సర్ కేసు యావరేజ్ కంటే ఇది ఆరు రెట్లు అధికంగా ఉందని వెల్లడించారు.
Also Read:Ponguru Narayana: 30 వేల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారుచేయడమే లక్ష్యంగా మెప్మా ప్రణాళిక..
క్యాన్సర్ కేసుల్లో ఆంధ్రప్రదేశ్ అట్టడుగు స్థాయిలో ఉంది. అయినా బలబద్రపురంలో ఎందుకు క్యాన్సర్ కేసులు ఎక్కువగా వస్తున్నాయో మూల కారణం కనుక్కోవాలి. ఆ ప్రాంతంలో ఉన్న పరిశ్రమల వల్ల ఈ పరిస్థితి ఉందని ఆ ప్రాంత ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం కూడా ఈ విషయంపై ప్రత్యేక చర్యలు చేపట్టింది. బలబద్రపురం పరిసర గ్రామాల్లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. అందుకే నేను ప్రజల పక్షాన సమస్య పరిష్కారం కోసం పోరాడుతున్నాను అని తెలిపారు.