కశింకోట మండలం నర్సింగబిల్లి గ్రామంలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. పిల్లిబోయిన బ్యూలా ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఈ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. విచారణలో ఆత్మహత్య కు ఓ యువకుడి ప్రేమ వేధింపులే కారణంగా పోలీసులు తేల్చారు. మైనర్ బాలికను ప్రేమ పేరుతో ఓ యువకుడు వేధింపులకు గురిచేసినట్లు గుర్తించారు.
Also Read:Roja: మాజీ మంత్రి రోజా భర్త సెల్వమణికి షాక్.. తమిళ నిర్మాతల సంఘం కీలక నిర్ణయం
పెయింటర్ గా పనిచేస్తున్న అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు తరచూ వేధింపులు గురి చేసేవాడు.. యువకుడి వేధింపులు తాళలేక తీవ్ర మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రి వరహాల రావు.. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. పరారీలో యువకుడు ఉండగా రెండు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహం అప్పగించారు.