రవినాయుడు, శాప్ ఛైర్మన్ మాజీ మంత్రి రోజాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రవినాయుడు మాట్లాడుతూ.. రోజాను అరెస్ట్ చేయడానికి దమ్ము అవసరం లేదు.. వారెంట్ ఉంటే చాలు అని తెలిపారు. రోజా అవినీతిపై పూర్తి స్థాయి విచారణ జరుగుతోంది.. రోజా జైలుకు వెళ్ళడం గ్యారంటీ.. నిరుపేదల క్రీడాకారులకు చెందిన 119కోట్లను రోజా దోచేశారు.. రోజా నోటి దూల వల్లే వైసిపికి 11సీట్లు వచ్చాయి..
Also Read:Amit Shah: మార్చి 2026 నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తాం..
చంద్రబాబును ఏకవచనంతో మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు.. చెన్నైలో తిరిగే రోజాకు ఏపీలో జరిగే అభివృద్ధి, సంక్షేమం గురించి ఏం తెలుస్తుంది. తిరుపతిలో వైసిపి నేతలు పగటివేషగాళ్ళలాగా తయారయ్యారు. విద్యుత్ ఛార్జీలను పెంచలేదన్న విషయం భూమన అభినయరెడ్డికి తెలియకపోవడం విడ్డూరం. విద్యుత్ ఛార్జీలపై బహిరంగ చర్చకు అభినయరెడ్డి సిద్దమా..? భూమన అభినయరెడ్డికి కనీస పరిజ్ఞానం కూడా లేదు.. టిడిఆర్ బాండ్ల కుంభకోణంలో అసలు పాత్రధారి భూమన అభినయరెడ్డి అని విమర్శించారు.