బాబూ జగజ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మాజీమంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ వారసత్వాన్ని పుణిపుచ్చుకుని దేశ అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయులు జగజ్జీవన్ రామ్.. అట్టడుగు వర్గాల ప్రజలను అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకే చంద్రబాబు పి 4 పథకం ప్రవేశ పెట్టారు..గత ప్రభుత్వం బాబూ జగజ్జీవన్ రామ్ విషయంలో చిన్న చూపు చూసింది.. దళితులు అంటేనే జగన్మోహన్ రెడ్డికి చులకన.. అందుకే నేటికీ దళిత నాయకులకు అపాయింట్‌మెంట్ ఇవ్వటం లేదు అని విమర్శించారు.
Also Read:CBI Raids: చెన్నైలో సీబీఐ మెరుపు దాడులు.. ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో సహా 18 చోట్ల దాడులు
కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై మైనారిటీల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.. మైనారిటీ సంఘాల నేతలతో చర్చించి వారి నిర్ణయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే బాగుంటుంది.. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై జగన్ ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారు.. పోలవరం ఎత్తు తగ్గించారని వైసీపీ నేతలు చెబుతున్నారు.. గత ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను కేంద్రం ఆమోదించింది.. దీనిపై వైసీపీ నేతలే సమాధానం చెప్పాలి” అని డొక్కా మాణిక్యవరప్రసాద్ తెలిపారు.