వైసీపీ మైనారిటీ విభాగం అధ్యక్షుడు ఖాదర్ భాష టీడీపీ, జనసేనలపై మండిపడ్డాడు. వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించిన ఇచ్చిన వైసీపీ అధినేత జగన్ కు రెండు రాష్ట్రాల ముస్లిం సమాజం కృతజ్ఞతలు చెబుతోందని అన్నాడు. ఖాదర్ భాష మాట్లాడుతూ.. చంద్రబాబు సూచించిన మూడు సవరణల వల్ల ఒరిగేదేమీ లేదు.. ముస్లింలను నిలువునా మోసం చేసి వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇచ్చింది టీడీపీ.. వైసీపీ లోక్ సభలో వ్యతిరేకంగా ఓటు వేసిందని.. రాజ్యసభ లో అనుకూలంగా ఓటు వేసిందని ప్రచారం చేస్తున్నారు.. మీ ప్రచారాలను నిరూపించాలని మా పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కూడా సవాలు చేశారు..
Also Read:Thane: 13 ఏళ్ల క్యాన్సర్ పేషెంట్‌పై అత్యాచారం.. కీమో సమయంలో బయటపడిన ప్రెగ్రెన్సీ..
టీడీపీ, జనసేన పార్టీలు రెండు నాల్కల ధోరణి విడనాడాలి.. ముగ్గురు ముస్లిం నేతలను గెలిపించినా వారినే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. చంద్రబాబు చేసిన అన్యాయాలు ముస్లింలకు అర్థమయ్యాయి.. నల్లచట్టాలు తేవటానికి బీజేపీకి సహకరించిన టీడీపీ, జనసేన.. విజయవాడలో హజ్ ఎంబర్స్మెంట్ పాయింట్ కూడా తీసేశారు.. ముస్లింల సంక్షేమానికి గతంలో వైఎస్ఆర్.. ఇప్పుడు జగన్ పాటుపడుతున్నారని ఖాదర్ భాష తెలిపాడు.