Malpractice in MBBS Exams: ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ విద్యార్ధులు మాల్ ప్రాక్టీసులో పట్టుబడటం కలకలం రేపుతోంది.. సిద్దార్ధ వైద్య కళాశాలల్లో బుధవారం జరిగిన సప్లిమెంటరీ పరీక్షల్లో ముగ్గురు విద్యార్థులు స్లిప్పులు పెట్టారన్న సమాచారం రావటంతో ఎన్టీఆర్ యునివర్సిటీ అధికారులు తనిఖీలు చేశారు.. ఈ తనిఖీల్లో ఎన్నారై కళాశాలకు చెందిన ఇద్దరు, నిమ్రా కళాశాలకు చెందిన ఒక విద్యార్థిని స్లిప్పులతో సహా పట్టుకుని మాల్ ప్రాక్టీస్ చేస్తున్నట్టు గుర్తించారు.. దీంతో ముగ్గురు విద్యార్థుల నుంచి హాల్ టికెట్లను లాగేసుకున్నారు ఇన్విజిలెటర్లు.. విద్యార్థులు పరీక్ష పత్రాలను మాల్ ప్రాక్టీస్ కమిటీకి పంపారు. ఇన్విజిలెటర్లుగా వైద్యులను కాకుండా వేరే వారిని నియమిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.. పదుల సంఖ్యలో విద్యార్దులు మాల్ ప్రాక్టీసుకు పాల్పడినా కేవలం ముగ్గురు మాత్రమే పట్టుబడ్డారని.. మిగతా వారు తప్పించు కున్నారనే ఆరోపణలు ఉన్నాయి.. మరోవైపు మాల్ ప్రాక్టీసులో కొందరు కళాశాల సిబ్బంది వెనుకుండి నడిపిస్తున్నారని ఆరోపణలపై కూడా అంతర్గత విచారణ చేపట్టారు యునివర్సిటీ అధికారులు. మాల్ ప్రాక్టీస్ కమిటీ విచారణ జరిపి మాల్ ప్రాక్టీస్ చేసినట్టు నిర్ధారణ చేస్తే ముగ్గురు విద్యార్థులపై మూడేళ్ల పాటు వేటు వేస్తూ చర్యలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు అధికారులు..
Read Also: AI Wonder: వైద్య రంగంలో అద్భుతం.. ఏఐ సాయంతో శిశువు జననం