CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొంథా తుఫాన్ తర్వాత పరిస్థితితో పాటు పంట నష్టంపై కాసేపట్లో ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
AP Crime: టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని అమాయకులను మోసం చేసే వారి సంఖ్య కూడా పెరిగిపోయింది.. తాజాగా, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఫోటోను తమ వాట్సాప్ డీపీగా పెట్టుకుని.. తాము ఎన్.ఆర్.ఐ.లమని చెప్పుకుంటూ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు కీలక నిందితులను అరెస్ట్ చేసింది సీఐడీ.. ఈ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న సాయి శ్రీనాథ్ (గచ్చిబౌలి, హైదరాబాద్), సుమంత్ (పఠాన్ చెరువు) లను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.…
Off The Record: భీమవరం అసెంబ్లీ సెగ్మెంట్….. 2019లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు దారణమైన అనుభవాన్ని మిగిల్చిన నియోజకవర్గం. అదే చోట ఈసారి… 2024లో పార్టీ అభ్యర్థి గెలిచినా… ఆ ఆనందం రోజురోజుకీ ఆవిరి అయిపోతోందట. 2024లో నేను ఎక్కడ పోటీ చేసినా…. భీమవరాన్ని మాత్రం మర్చిపోను .. అభివృద్ధి చేసి చూపిస్తానని అప్పట్లో పవన్ ఇచ్చిన హామీలకు దిక్కు లేకుండా పోతోందని అంటున్నారు. అధినేత ఆశయాలను,ఇచ్చిన మాటను పక్కన పెడుతున్న భీమవరం జనసేన నేతలు… సంపాదన మీదే శ్రద్ధ…
Cyclone Montha: మొంథా తుఫాన్‌ను సమర్థంగా ఎదుర్కొన్నాం.. ఇప్పుడు తుఫాన్ అనంతర చర్యలు అత్యంత కీలకమైనవి. ఈ సమయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖలు యుద్ధ ప్రాతిపదికన పని చేయాలి.. పటిష్టమైన ప్రణాళికతో, సమన్వయంతో పనిచేయాలి. తుఫాను, భారీ వర్షాలు తగ్గాక గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య, తాగునీటి సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. ఎక్కడా ఇబ్బందులు లేకుండా దీనిని సమర్థవంతంగా పరిష్కరించాల్సిన బాధ్యత మనపై ఉందని డిప్యూడీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులకు…
Off The Record: ఏబీ వెంకటేశ్వరరావు….. రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్. సర్వీసులో ఉన్నప్పుడు గత వైసీపీ ప్రభుత్వం మీద ఒక రకంగా ఆయన యుద్ధమే చేశారన్నది విస్తృతాభిప్రాయం. అదే సమయంలో టీడీపీ సానుభూతిపరుడన్న ముద్ర కూడా గట్టిగానే ఉండేది. కానీ… ఇప్పుడాయన కూటమి సర్కార్ మీద కూడా అప్రకటిత యుద్ధం చేస్తున్నారా అన్నది కొత్త డౌట్. ఏబీవీ చర్యలు కూడా దాన్నే సూచిస్తున్నాయంటున్నారు పరిశీలకులు. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి, కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టాక కూడా…
Cyclone Montha Damage: మొంథా తుఫాన్ విధ్వంసం సృష్టించింది.. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.. అయితే, నష్టంపై ప్రాథమిక అంచనాలు వేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన ముగించుకుని రాష్ట్ర సచివాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. తుఫాన్ వల్ల వచ్చిన నష్టంపైనా, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపైనా ఆర్టీజీఎస్ నుంచి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.. సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయో అధికారులను అడిగి…
Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది.. వైసీపీకి గుడ్‌బై చెప్పిన పార్టీ నేతలు, కార్యకర్తలు.. పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో చేరారు.. సంబేపల్లి, లక్కిరెడ్డిపల్లి మండలాలకు చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆ పార్టీకి బైబై చెప్పేసి.. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గురిగింజకుంట, దప్పేపల్లి గ్రామాలకు చెందిన వైసీపీ సర్పంచ్ లు రఘునాథ రెడ్డి, కేశవప్ప ఆధ్వర్యంలో…