Minister Narayana: అమరావతి రైతులకు ప్లాట్ల కేటాయింపు, వాటి రిజిస్ట్రేషన్లపై క్లారిటీ ఇచ్చారు మంత్రి నారాయణ. అమరావతి రైతులకు ప్లాట్ ల కేటాయింపు, రిజిస్ట్రేషన్లపై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డ ఆయన.. సోషల్ మీడియాలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా పోస్టులు పెడుతున్నారు.. రైతులకు రిటర్నబుల్ ప్లాట్ ల కేటాయింపు, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ దాదాపు తుది దశకు చేరుకొంది.. ల్యాండ్ పూలింగ్ కింద మోట్ 30,635 మంది రైతులకు కేటాయించాల్సి ఉంది.. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత…
Cyclone Montha: మొంథా తుఫాన్ విధ్వంసం సృష్టించింది.. భారీ నష్టాన్ని మిగిల్చింది.. మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది.. తుఫాన్ అనంతర పరిస్థితులపై ఇరిగేషన్ అడ్వైజర్, ఈఎన్సీ, సీఈలు, ఎస్ఈ లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించాం మంత్రి నిమ్మల రామానాయుడు.. ఆత్మకూరు, డోర్నాలా ప్రాంతంలో భారీ వర్షాలతో వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ కు గండి పడి నీరు చేరినట్టు తెలిపారు.. వెలిగొండ టన్నెల్ ఎగ్జిట్ ప్రాంతానికి…
Cyclone Montha: మొంథా తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సచివాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.. హోంమంత్రి అనిత, సీఎస్ కె.విజయానంద్, ఆర్టీజీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. వచ్చే 48 గంటల పాటు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. వర్షాలతో రహదారులపై పేరుకుపోయిన మట్టి, బురదను తొలగించేందుకు అగ్నిమాపక శాఖ తగిన చర్యలు చేపట్టాలి.. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో గృహాలు,…
Cyclone Montha: తీరం దాటిన మొంథా తుఫాన్ ఎఫెక్ట్‌తో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. తీర ప్రాంతాల జిల్లాలో విధ్వంసం సృష్టించిన మొంథా.. మిగతా జిల్లాల్లోనూ తీవ్ర పంట నష్టాన్ని మిగిల్చింది.. ఇక, తుఫాన్ ప్రభావంతో.. ఈస్ట్ కోస్ట్, సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో పెద్ద సంఖ్యలో రైళ్లను పూర్తిగా రద్దు చేయాల్సిన పరిస్థితి.. కొన్ని రైళ్లను దారి మళ్లించగా.. కోస్తా ప్రాంతాలు.. విజయవాడ మీదుగా నడవాల్సిన చాలా రైళ్లను రద్దు చేశారు.. ఈ నేపథ్యంలో…
Cyclone Montha: తుఫాన్ బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలోని ఓడలరేవు గ్రామంలో తుఫాన్ పునరావాస కేంద్రాలను సందర్శించిన సీఎం చంద్రబాబు.. పునరవాస కేంద్రాలలో ప్రజలతో మాట్లాడారు.. ప్రజలకు నిత్యవసరాలతో పాటు బియ్యం కూడా అందజేసినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు… అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని తుఫాన్ ఎఫెక్ట్ తో ప్రాణనష్టం జరగకుండా అర్ధరాత్రి వరకు మానిటర్ చేశాం.. వరి పంట కొంతవరకు…
CM Chandrababu Aerial Survey: మొంథా తుఫాన్ ఆంధ్రప్రదేశ్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.. బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్ కాకినాడ – మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం సమీపంలో తీరాన్ని తాకింది. ఆ తర్వాత బలమైన తుఫాన్‌గా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే, తుఫాన్ కారణంగా దెబ్బతిన్న కోనసీమలోని తీరప్రాంతాలలో ఏరియల్ సర్వే నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఓడలరేవు ఓఎంజీసీ టెర్మినల్ కు చేరుకున్న…
Good News to Cotton Farmers: పత్తి రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రేపటి నుంచే పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది.. పత్తికి కనీస మద్దతు ధర రూ.8,110గా నిర్ణయించింది.. రాష్ట్రవ్యాప్తంగా 30 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.. తక్షణమే పత్తి సేకరణ చేపట్టాలని సీసీఐ సంబంధిత అధికారులను ఆదేశించారు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు.. 2025-26 సంవత్సరానికి 4.56 లక్షల హెక్టార్లలో పత్తి సాగు అయినట్లు, సుమారు 8…
Cyclone Montha: మొంథా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది జనసేన పార్టీ.. జనసేన పార్టీ పీఏసీ చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ టెలీకాన్ఫరెన్స్ ద్వారా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. తుఫాన్ సహాయక చర్యల్లో జనసేన నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జనసైనికులు, వీర మహిళలు ముందుండాలని మంత్రి మనోహర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ యంత్రాంగానికి పార్టీ శ్రేణులు తగిన విధంగా…