Students Carry Tent Equipment: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు.. మలికిపురం మండలం బట్టేలంక హై స్కూల్లో చోటుచేసుకున్న సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం ఒక రోజు ఆటల పోటీలు నిర్వహించే క్రమంలో, స్కూల్ టీచర్లు విద్యార్థుల చేత టెంట్ సామాన్లు మోయించారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. Read Also: New York Mayor Elections: ట్రంప్‌కు భారీ…
Srisailam: కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు శ్రీశైలం చేరుకుని, పాతాళగంగలో పవిత్ర స్నానాలు ఆచరించారు. కార్తీక పౌర్ణమి పుణ్యస్నానం ఎంతో పవిత్రమని నమ్మే భక్తులు గంగా దేవిని స్మరిస్తూ పుణ్యస్నానంలో పాల్గొన్నారు. గంగాధర మండపం, ఉత్తర మాడవీధి, ఈశాన్య వీధుల్లో భక్తులు వేలాది దీపాలను వెలిగించి భక్తి శ్రద్ధలతో మల్లన్నను ప్రార్థించారు. సాయంత్రం సమయానికి దీపాలతో కాంతులీనిన శ్రీశైలం…
Annavaram: ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలో నేడు శ్రీ సత్యదేవుని గిరి ప్రదక్షిణ ఘనంగా జరగనుంది.. సుమారు 9 కిలోమీటర్ల మేర ఈ గిరి ప్రదక్షిణ కొనసాగనుంది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు పల్లకీలో, మధ్యాహ్నం 2 గంటలకు సత్య రథంపై రెండు విడతలుగా గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుంది. సుమారు 3 లక్షల మంది భక్తులు ఈ మహోత్సవంలో పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటీవల కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన…
Nara Bhuvaneshwari: లండన్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి రెండు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. లండన్‌లోని మేఫెయిర్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (IoD) మరియు ఐవోడీ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో భువనేశ్వరికి ఈ గౌరవాలు లభించాయి. Read Also: Plane Crashe: అమెరికాలో కూలిన కార్గో విమానం.. ముగ్గురు మృతి ప్రజా సేవా రంగం,…
Off The Record: విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో కూటమి పార్టీల కుమ్ములాటలు పతాకస్థాయికి చేరాయి. పొత్తు కింద నెల్లిమర్ల నియోజకవర్గం జనసేనకు కేటాయించినప్పటి నుంచి టీడీపీ స్థానిక నాయకుల్లో అసంతృప్తి అంతకంతకూ కొనసాగుతోందన్నది బహిరంగ రహస్యం. తొలి నుంచి ఈ నియోజకవర్గం టీడీపీ కంచుకోట. కానీ పట్టు లేని జనసేనకు కేటాయించడంపై నువ్వా నేనా అన్న తరహాలో వార్ సాగుతోంది. అధిష్టానం నుంచి అక్షింతలు పడుతున్నా వీరి తీరు మారలేదు. మళ్లీ వరద బాధితులకు నిత్యావసర…
Off The Record: ఈయన మేకపాటి రాజమోహన్ రెడ్డి. వైసీపీ మాజీ ఎంపీ. సీనియర్ మోస్ట్ నాయకుడు. మాజీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి తండ్రి. కొడుకు జయంతి సభలో రాజమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. జగన్ సీఎంగా ఉండగా వైసీపీలో ఓ బ్యాచ్ ఎప్పుడూ ఆయన్ను విపరీతంగా పొగిడేస్తూ ఉండే వారు. జగన్ ఎవర్నైతే ప్రత్యర్ధి అనుకుంటారో ఈ బ్యాచ్ నేతలు టార్గెట్ చేసుకుని నోటికొచ్చింది మాట్లాడేవారు. ఈ బ్యాచ్ లో మంత్రులు, ఎమ్మెల్యేలూ,…
Minister Nara Lokesh: మొంథా తుఫాన్ బాధిత ప్రాంతాల్లో పర్యటించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్.. బాధిత రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా కూటమి సర్కార్‌పై ఆరోపణలు గుప్పించారు.. అయితే, అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి వచ్చే జగన్.. ఎప్పుడూ ప్రజల మధ్య ఉండే మా వైపు ఒక వేలెత్తి చూపిస్తున్నారు.. కానీ, మీ వైపు చూపే నాలుగు వేళ్లు ఉన్నాయని మాత్రం మర్చిపోతున్నారు, అని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. Read Also: PNB LBO…
కోడికి.. గుడ్డుకి తేడా తెలియని వైసీపీ వాళ్ల గురించి మాట్లాడటం వేస్ట్.. రోజా మాటలు వింటే మగవాళ్లే సిగ్గు పడతారు..! వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు.. వైసీపీ ఎమ్మెల్యేల అసెంబ్లీకి రాకపోవడంతో రాజ్యాంగబద్ధంగా తీసుకునే చర్యలను పరిశీలిస్తున్నాం అంటూ హాట్ కామెంట్స్ చేశారు.. జగన్మోహన్ రెడ్డి మినహా మిగిలిన 10 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ప్రతీ నెలా జీతాలు తీసుకుంటున్నారని…