Google Pixel 10పై భారీ ధర తగ్గింపు.. ఏకంగా ₹12,000 డిస్కౌంట్.!
- Google Pixel 10పై భారీ ధర తగ్గింపు
- బ్యాంక్ ఆఫర్లు , అదనపు డిస్కౌంట్లు
- ఎఫెక్టివ్ ప్రైస్ ఎంతవరకు తగ్గుతుంది?
- పిక్సెల్ 10లో లభించే కీలక ఫీచర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గూగుల్ తన లేటెస్ట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ గూగుల్ పిక్సెల్ 10 (Google Pixel 10) పై భారత మార్కెట్లో సంచలన ఆఫర్‌ను ప్రకటించింది. ప్రముఖ రిటైల్ విక్రయ సంస్థ ‘విజయ్ సేల్స్’ (Vijay Sales) వేదికగా ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీగా ధర తగ్గింది. ఆండ్రాయిడ్ ప్రియులకు, ముఖ్యంగా పిక్సెల్ ఫోన్ల కోసం ఎదురుచూసే వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో ఉన్నాయి.
భారీగా తగ్గిన పిక్సెల్ 10 ధర
Also Read
- Jio Unlimited 5G Data: జియో బంపర్ ఆఫర్.. రూ.15 రీఛార్జ్‌తో రోజంతా అపరిమిత 5G ఇంటర్నెట్.!
- Mijia Electric Toothbrush 2 Pro: షియోమీ ఎలక్ట్రిక్ టూత్‌బ్రష్ లాంచ్.. కలర్ స్క్రీన్, ప్రెజర్ అలర్ట్ ప్రత్యేకతలు ఇవే!
- Google Maps: అసలు.. గూగుల్ మ్యాప్స్‌కు ట్రాఫిక్ జామ్ ఎలా తెలుస్తుంది? దీని వెనుక అసలు టెక్నాలజీ ఇదే!
- REDMAGIC 12 Pro: 8400mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ ఫోన్.. REDMAGIC 12 Pro లాంచ్.. 185Hz OLED డిస్ప్లే, 50MP కెమెరా
భారత్‌లో గూగుల్ పిక్సెల్ 10 (12GB RAM + 256GB స్టోరేజ్) వేరియంట్ లాంచ్ ధర ₹79,999 గా ఉంది. అయితే, ప్రస్తుతం విజయ్ సేల్స్‌లో ఈ ఫోన్ ధరను నేరుగా తగ్గించి ₹74,999 కే అందుబాటులో ఉంచారు. అంటే ఎటువంటి నిబంధనలు లేకుండానే వినియోగదారులకు ₹5,000 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తోంది. కేవలం ఫ్లాట్ డిస్కౌంట్ మాత్రమే కాకుండా, అదనపు ఆఫర్లతో ఈ ధరను మరింత తగ్గించుకోవచ్చు.
బ్యాంక్ ఆఫర్లు , అదనపు తగ్గింపులు
- HDFC బ్యాంక్ ఆఫర్: విజయ్ సేల్స్ తన వినియోగదారులకు పలు బ్యాంక్ ఆఫర్లను కూడా అందిస్తోంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డ్ ఉపయోగించి ఈఎంఐ (EMI) పద్ధతిలో కొనుగోలు చేస్తే అదనంగా ₹7,000 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.
- ICICI బ్యాంక్ ఆఫర్: ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై 5 శాతం (గరిష్టంగా ₹3,000) వరకు తగ్గింపు పొందవచ్చు.
- ఎఫెక్టివ్ ధర: ఫ్లాట్ డిస్కౌంట్ , హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆఫర్ రెండింటినీ కలిపితే, దాదాపు ₹12,000 వరకు ఆదా అవుతుంది. దీనివల్ల వినియోగదారులకు ఈ ఫోన్ సుమారు ₹67,999 కే లభించే అవకాశం ఉంది.
పిక్సెల్ 10 – అదిరిపోయే ఫీచర్లు
- డిస్ప్లే: గూగుల్ పిక్సెల్ 10 కేవలం కెమెరా కోసమే కాకుండా, అత్యుత్తమ పనితీరు కోసం కూడా పేరుగాంచింది. ఇందులో 6.3-అంగుళాల యాక్చువా OLED డిస్ప్లే కలదు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ , 3,000 నిట్స్ గరిష్ట ప్రకాశాన్ని (Peak Brightness) కలిగి ఉంటుంది.
- ప్రోసెసర్: గూగుల్ సొంతంగా తయారు చేసిన శక్తివంతమైన టెన్సర్ G5 (Tensor G5) చిప్సెట్తో ఈ ఫోన్ పనిచేస్తుంది. ఇది మునుపటి మోడళ్ల కంటే వేగంగా , స్మార్ట్‌గా పనిచేస్తుంది.
- కెమెరా: ఫోటోగ్రఫీ ప్రేమికుల కోసం ఇందులో 48MP మెయిన్ కెమెరా, 13MP అల్ట్రావైడ్ , 10.8MP టెలిఫోటో కెమెరాలతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది.
- బ్యాటరీ , ఛార్జింగ్: 4,835mAh బ్యాటరీతో పాటు 30W ఫాస్ట్ ఛార్జింగ్ , వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది.
AI ఫీచర్లు , సాఫ్ట్వేర్ అప్డేట్లు
పిక్సెల్ 10 ఫోన్ ఆండ్రాయిడ్ 16 (Android 16) అవుట్-ఆఫ్-ది-బాక్స్‌తో వస్తుంది. గూగుల్ ఈ ఫోన్‌కు ఏకంగా 7 ఏళ్ల పాటు ఓఎస్ (OS) , సెక్యూరిటీ అప్డేట్లు ఇస్తామని హామీ ఇచ్చింది. దీనివల్ల 2033 వరకు మీ ఫోన్ సరికొత్త సాఫ్ట్‌వేర్‌తో అప్డేటెడ్గా ఉంటుంది. అలాగే ఇందులో గూగుల్ జెమిని AI (Gemini AI), సర్కిల్ టు సెర్చ్ (Circle to Search), , మ్యాజిక్ ఎడిటర్ వంటి అత్యాధునిక ఏఐ ఫీచర్లు ఇన్‌బిల్ట్‌గా వస్తున్నాయి. మీరు ఒక ప్రీమియం కెమెరా ఫోన్ , లేటెస్ట్ టెక్నాలజీ ఉన్న స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే, విజయ్ సేల్స్‌లో లభిస్తున్న ఈ ఆఫర్ మిస్ చేసుకోవద్దు.
గ్రిల్, టెయిల్ లైట్ల డిజైన్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్.. 2026 చివర్లో Skoda Slavia Facelift లాంచ్
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. కొన్ని చోట్ల పోలింగ్ వాయిదా, పోలీసుల అదుపులో వైసీపీ ఏజెంట్లు!
-
Jio Unlimited 5G Data: జియో బంపర్ ఆఫర్.. రూ.15 రీఛార్జ్‌తో రోజంతా అపరిమిత 5G ఇంటర్నెట్.!
-
Anshul Kamboj: ఆహా అన్షుల్ కాంబోజ్.. ఒక్క బంతి ఆడకుండానే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’.. భారత ప్లేయర్స్ లిస్ట్ ఇదే!
-
Shubman Gill: కోహ్లీ బ్యాటింగ్ సూపర్.. కానీ రోహిత్ శర్మ వల్లే మ్యాచ్ గెలిచాం.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Thursday Horoscope: గురువారం రాశి ఫలాలు.. ఈ 5 రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు.. ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు!
ట్రెండింగ్
-
WPL 2027 Schedule: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. WPL 2027 షెడ్యూల్ విడుదల.. మ్యాచ్‌ల తేదీలు, వేదికల వివరాలివే..!
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!