Republic Day: జనవరి 26 వెనుక ఆసక్తికరమైన హిస్టరీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Republic Day: మరో రెండు రోజుల్లో యావత్ దేశం గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోడానికి సిద్ధం అవుతుంది. ఈ క్రమంలో మీలో ఎంత మందికి జనవరి 26 వెనుక ఉన్న ఆసక్తికరమైన హిస్టరీ తెలుసు. ఇంతకీ యావత్ భారతావనీ జనవరి 26నే రిపబ్లిక్ డే వేడుకలు ఎందుకు నిర్వహిస్తుంది, నిజానికి నవంబర్ 26, 1949నే రాజ్యాంగ సభ భారత రాజ్యాంగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన, దానిని అమలు చేయడానికి టైం ఎందుకు తీసుకున్నారు. సంవత్సరంలో ఎన్నో రోజులు, నెలలు ఉండగా జనవరి 26 తేదీనే ఎంచుకోవడానికి కారణాలు ఏంటి? ఈ స్టోరీలో సమాధానాలు తెలుసుకుందాం.
READ ALSO: 2026 Mega Summer: థియేటర్లలో దండయాత్రకు సిద్ధమైన మెగా హీరోలు!
Also Read
జనవరి 26 కోసం ఇప్పటికే ఢిల్లీ వీధుల్లో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. భారత దేశానికి 1947 ఆగస్ట్ 15న స్వాతంత్ర్యం లభించింది. ఈ క్రమంలో ఇండియాకు ఒక ప్రత్యేక రాజ్యాంగం ఉండాలని చాలా మంది పెద్దలు ఆలోచించారు. ఈ ఆలోచనలను ఆచరణ రూపంలోకి తీసుకురావడానికి ఆగస్టు చివర్లో డాక్టర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు.. రాజ్యాంగ రచనకు ఈ కమిటీ ఎంతో కృషి చేసింది. ఈ కమిటీకి భారత రాజ్యాంగ రచనకు 2ఏళ్ల, 11 నెలల, 18 రోజుల సమయం పట్టింది. 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ ఈ రాజ్యాంగానికి ఆమోదం తెలిపింది. అయితే రాజ్యాంగ సభ ఆమోదం పొందిన వెంటనే ఈ రాజ్యాంగం అమల్లోకి రాలేదు.
కొన్ని సర్దుబాట్లు చేసుకొని రెండు నెలలకు అంటే జనవరి 26 న అమల్లోకి తీసుకొచ్చారు. 200 ఏళ్ల బ్రిటిష్ పాలకుల కబంద హస్తాల నుంచి భారతావని విముక్తి కోసం జరిగిన స్వాతంత్ర్య పోరాటంలో జనవరి 26కు విశేష ప్రాముఖ్యత ఉంది. 1930 జనవరి 26న.. తొలిసారిగా పూర్ణ స్వరాజ్ (సంపూర్ణ స్వాతంత్ర్యం) నినాదాన్ని ఇచ్చింది కాంగ్రెస్. దేశ చరిత్రలో అదొక కీలక ఘట్టంగా భావిస్తూ ఉంటారు.. ఆ తర్వాత 20 ఏళ్లకు జనవరి 26 న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఈ తేదీని పురష్కరించుకుని ప్రతి ఏడాది రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది.
READ ALSO: Mini Projectors: ఇక సినిమా హాళ్లకు వెళ్లనవసరం లేదు.. ఇంట్లోనే థియేటర్ ఎక్స్‌పీరియన్స్!
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?