TTD Parakamani Case: టీటీడీ పరకామణి చోరీ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విచారణకు హాజరైన సమయంలో CVSO సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం హైకోర్టుకు తెలిసినట్లు పేర్కొంది.. ఇదే సమయంలో కీలక ఆదేశాలు జారీ చేశారు హైకోర్టు… ఈ కేసులో నిందితుడు రవికుమార్‌తో పాటు సాక్ష్యులకు భద్రత కల్పించాలని స్పష్టం చేసింది.. పరకామణి చోరీ కేసు విచారణ ముగిసే వరకు సాక్ష్యులకు ప్రొటెక్షన్ ఇవ్వాలని ఏపీ సీఐడీ డీజీకి ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం.. ఇక, ఈ కేసులో తదుపరి విచారణను డిసెంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది.. హైకోర్టు ఈ ఆదేశాల ద్వారా విచారణ సమయంలో ఏదైనా అనవసర ఇబ్బందులు రాకుండా, సాక్ష్యుల భద్రతను ప్రాధాన్యం ఇవ్వాలన్న అంశాన్ని స్పష్టంగా తెలిపింది. కాగా, సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి కేసును ఆ తర్వాత హత్య కేసుగా నమోదు చేసిన విషయం విదితమే.. పరకామణి చోరీ కేసులో విచారణ జరుగుతుండగా.. జరిగిన సతీష్ కుమార్ ఘటన తీవ్ర కలకలం సృష్టించిన విషయం విదితమే..
Read Also: Shocking Video: : విద్యార్దిని మెట్లపై నుంచి కిందకు తోసేసిన ప్రిన్సిపాల్… వీడియో వైరల్