Tirupati Crime: మైనర్ బాలికను అపహరించి అత్యాచారం చేసిన కేసులో ఇద్దరు యువకులు, వారికి సహకరించిన యువతిని అరెస్టు చేశారు ఈస్ట్ పోలిసులు. చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురం సమీపంలోని గాంధీపురానికి చెందిన రోహిణి.. తిరుపతికి చెందిన బాలికకు ఈనెల 9న రాత్రి ఫోన్ చేసి పీలేరు దగ్గర జలపాతాలకు తీసుకెళ్తానని రెండుజతల బట్టలు తీసుకుని తిరుపతిలోని మున్సి పల్ పార్కు వద్దకు రమ్మని పిలిచింది. నమ్మివచ్చిన బాలికను చంద్రగిరిలోని తన ఇంటికి తీసుకెళ్లి.. మరుసటి రోజు ఉదయం పీలేరులోని ఇందిరమ్మ ఇళ్ల వద్దకు తీసు కెళ్లింది. అదే సమయంలో ఆమె తమ్ముడు మల్లికార్జున, అతని స్నేహితుడు గుణశే ఖర్ అక్కడికి వచ్చారు. బాలికను ఇంట్లో వదిలి ముగ్గురూ బయటకు వెళ్లి తర్వాత యువకులు మాత్రమే తిరిగివచ్చారు. మల్లికార్జున బాలికపై అత్యాచారానికి పాల్పడగా గుణశేఖర్ అత్యాచారానికి యత్నించగా ప్రతిఘటించింది. నిందితులు రెండోరోజు బాలికను వదిలిపెట్టగా ఆమె ఇంటికి చేరుకుని విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో అదృశ్యం కేసును అత్యాచారం, పోక్సో కేసుగా మార్చి ముగ్గురు అరెస్టు చేశారు.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?