మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డికి కూడా సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ రోజు (ఏప్రిల్ 18న) విచారణకు రావాల్సిందిగా సూచించారు. విచారణకు వచ్చి తన దగ్గర ఉన్న వివరాలు ఇవ్వాల్సిందిగా అతడిని సిట్ కోరింది.
మేయర్ అవిశ్వాస పరీక్ష ముందు వైసీపీకి మరో షాక్ తగిలింది.. పార్టీకి రాజీనామా చేశారు 6వ వార్డు కార్పొరేటర్ లక్ష్మీ ప్రియాంక.. ఆమె, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కుమార్తె కావడం ఇక్కడ చర్చగా మారింది..
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన దళిత యువకుడి హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్సీ అనంత బాబు కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసు విచారణ వేగవంతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాదిగా రాజమండ్రికి చెందిన మొక్కల సుబ్బారావును నియమించారు.
అన్నమయ్య జిల్లా పొన్నూటిపాళెం సమీపంలో చిరుత మృతి ఘటనపై సమగ్ర విచారణ చేయాలని డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు.. పీసీసీఎఫ్ చలపతిరావుని విచారణ అధికారిగా నియమించారు డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్..
వివిధ ప్రభుత్వ సేవలపై ఏపీ ప్రభుత్వం ప్రజాభిప్రాయం సేకరిస్తోంది.. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ మధ్య పౌర సేవలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వే నిర్వహించింది.. అయితే, ఈ సర్వేలో కొన్ని షాకింగ్ విషయాలతో పాటు.. మరికొన్ని ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.
తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందంటూ తప్పుడు ప్రచారం చేసి.. బెజవాడ కనకదుర్గమ్మ గుడి మెట్లను కడిగిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు తిరుమలలో జరుగుతోన్న అపచారాలు, ఘోరాలకు ప్రాయశ్చిత్తంగా.. తిరుమల మెట్లను కూడా కడగాలని సూచించారు మాజీ మంత్రి ఆర్కే రోజా..
వైసీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. టీటీడీని అపవిత్రం చేసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారులను నిర్వీర్యం చేసి.. పాలక మండలిని అవమానకరంగా దూషించాలని తిరుపతి తిరుమలలో అదేపనిగా చేస్తున్నారు. ఏదైనా ఒక మంచి కార్యక్రమం వస్తే దాన్ని అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు.. మంత్రి ఆనం రామానారాయణరెడ్డి