Vijayawada: వేసవి సెలవులు రావడంతో.. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.. పిల్లలు పెద్దలు కుటుంబ సమేతంగా ఆలయాలను.. టూరిస్ట్ ప్లేస్‌లను చుట్టేస్తున్నారు.. ఇక, సమ్మర్‌లో బెజవాడ కనకదుర్గమ్మ దర్శానికి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు.. అయితే, మూడు రోజుల పాటు ఘాట్ రోడ్డును పూర్తిగా మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు.. శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ పేరుతో విడుదల చేసిన ప్రకటనలో.. ఆ విషయాన్ని స్పష్టంగా పేర్కొంది దేవస్థానం..
Read Also: Pooja Hegde : పూజాహెగ్డే దుకాణం బంద్ అవుతుందా..?
ఘాట్ రోడ్‌ను మూడు రోజుల పాటు పూర్తిగా మూసివేయనున్నట్టు స్పష్టం చేసింది దేవస్థానం.. మరమ్మత్తులు, కొండచరియలు, మెష్ తదితర పనుల నిమిత్తం మే 06, 07, 08 తేదీలలో వరుసగా మూడు రోజుల పాటు ఘాట్ రోడ్ పూర్తిగా మూసివేయనున్నారు.. అయితే, శ్రీ కనకదుర్గానగర్ మార్గం నుండి భక్తులు దేవస్థానానికి చేరుకోవాల్సి ఉంటుంది.. మరోవైపు.. హైదరాబాద్ నుండి వచ్చే భక్తులు పున్నమి ఘాట్‌లో తమ వాహనాలు పార్క్ చేసుకోవాలని.. అక్కడ నుండి దేవస్థానం ఏర్పాటు చేస్తున్న ఉచిత బస్ ద్వారా దేవస్థానం చేరుకోవచ్చు.. ఇక, విశాఖపట్నం, చెన్నై తదితర ప్రాంతాల నుండి వన్ టౌన్ వైపు వచ్చే భక్తులు సీతమ్మ వారి పాదాలు వద్ద ఉన్న హోల్డింగ్ ఏరియాలో తమ వాహనాలు పార్క్ చేసుకోవాలి.. ఈ మూడు రోజులు పార్కింగ్ ప్రదేశాల నుండి దేవస్థానానికి ఉచిత రవాణా సదుపాయం కల్పించనున్నట్టు శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఓ ప్రకటనలో పేర్కొంది..