ఏపీ లిక్కర్ స్కాంలో సిట్ దూకుడు పెంచింది. సిట్ కీలక విషయాలను సేకరించి వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన రాజ్ కసిరెడ్డి, విజయసాయిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలకు నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టింది. ఇప్పటికే సిట్ విచారణకు హాజరయ్యారు విజయ సాయిరెడ్డి. ఇవాళ విచారణకు ఎంపీ మిథున్ రెడ్డి హాజరుకానున్నారు. విచారణకు రావాలని కసిరెడ్డికి నాలుగోసారి నోటీస్ ఇచ్చిన సిట్.. కసిరెడ్డి విచారణపై కొనసాగుతున్న సస్పెన్స్.. అందుబాటులో ఉండాలని కసిరెడ్డి తండ్రికి సిట్ ఆదేశాలు జారీచేసింది. Also…
Minister Narayana: స్వచ్చ ఆంధ్ర స్వర్ణాంధ్ర కోసం అందరూ సహకారం అందించాలని మంత్రి నారాయణ కోరారు. మన ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు.. కానీ, మన రాష్ట్రంలో చంద్రబాబు స్వచ్ఛంద కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.
రాష్ట్రంలో వైజాగ్ మేయర్ అవిశ్వాసం ఉత్కంఠ రేపుతోంది. మేజిక్ ఫిగర్ పై ఊగిసలాట కొనసాగుతోంది. మేయర్ హరివెంకట కుమారి పై కూటమి ఇచ్చిన అవిశ్వాసం నోటీసుపై ఓటింగ్ కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రలోభాలు హద్దులు దాటాయి. వైసీపీ, టీడీపీ విదేశాలలో క్యాంప్ లు తెరచి దశల వారీగా కార్పొరేటర్లను అక్కడకు తరలించాయి. శిబిరాల్లో ఉన్న వాళ్ళను కట్టడి చేసేందుకు సీనియర్లను కాపాలాపెట్టిన పరిస్థితి. మ్యాజిక్ ఫిగర్ 74దాటేశామని కూటమి ప్రకటించుకుంటోంది. ఇటీవల నలుగురు కార్పొరేటర్లు వైసీపీకి…
కొద్దిగంటలు మాత్రమే సమయం...! నెలరోజుల ఉత్కంఠకు తెరపడుతుంది. రాష్ట్రంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ విశాఖపై అధిపత్యం ఎవరిదో తేలిపోతుంది. మేయర్ హరివెంకట కుమారి పై కూటమి ఇచ్చిన అవిశ్వాసం నోటీసుపై ఓటింగ్ కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రలోభాలు హద్దులు దాటాయి. వైసీపీ, టీడీపీ విదేశాలలో క్యాంప్ లు తెరచి దశల వారీగా కార్పొరేటర్లను అక్కడకు తరలించాయి.
ఏపీలో లిక్కర్ స్కాంపై సిట్ లోతైన విచారణ చేపడుతోంది. ప్రధానంగా లిక్కర్ స్కాం వెనుక ఎవరెవరు ఉన్నారు, లిక్కర్ డిస్టలరీస్ దగ్గర ముడుపులు ఎవరి నుంచి ఎవరికి చేరాయి, లిక్కర్ సేల్స్ లో ఎలా స్కామ్‌కు పాల్పడ్డారనే అనే అంశాలపై ప్రధానంగా సిట్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే సిట్ కీలక విషయాలను సేకరించింది. ఆ తర్వాతే వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన రాజ్ కసిరెడ్డి, విజయసాయిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలకు నోటీసులు ఇచ్చి విచారణ…
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో టీడీపీ - వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా జరిగిన తణుకు వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో కారుమూరి నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై తణుకు టీడీపీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఘాటుగా స్పందించారు. తప్పుడు మాటలు మాట్లాడుతూ తప్పుడు వ్యవహారాలు చేసిన కారుమూరి నాగేశ్వరరావును నియోజకవర్గంలో ఇకపై తిరగనివ్వమంటూ ఎమ్మెల్యే అరమిల్లి వార్నింగ్ ఇచ్చారు.. నోటి దురద కంట్రోల్ చేసుకోకుండా మాట్లాడుతున్నారని..
ప్రాంతీయ పార్టీలో ఎవ్వరూ నంబర్ 2 వుండరు.. ఒక్కటి నుండి 100 తరువాత మాత్రమే 101 వుంటుంది అని వ్యాఖ్యానించారు.. పార్టీ కోసం ఏం చేసినా.. జగన్, నేను, ప్రశాంత్ కిషోర్ కలిసి చేశాం.. కానీ, వైసీపీ అధికారంలోకి వచ్చాక 6 నెలల్లోనే నంబర్ 2 అనేది మిథ్య అని గమనించాను.. ఆ ఆరు నెలల్లోనే నా స్థానం నంబర్ 2 నుంచి 2 వేలకు పడిపోయిందన్నారు..
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు సిట్ అధికారులు.. దాదాపు 3 గంటల పాటు విజయసాయిరెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించింది సిట్.. లిక్కర్ స్కాంలో సాక్షిగా హాజరుకావాలని విజయసాయిరెడ్డి గతంలో నోటీసులు జారీ చేసింది సిట్.. దీంతో, విజయవాడ సిట్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.. అయితే, కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి.. ఈ స్కామ్‌లో కీలక సూత్రధారి అని విజయసాయిరెడ్డి సిట్ బృందానికి తెలిపారట..