* నేడు పహల్గామ్ దాడిపై కేంద్రానికి ఎన్ఐఏ రిపోర్ట్.. ఇప్పటికే 90 ఓవర్ గ్రౌండ్ వర్కర్లపై కేసులు.. ఇప్పటి వరకు 3వేల మందిని ప్రశ్నించిన ఎన్ఐఏ.. 100కు పైగా ప్రాంతాల్లో బలగాల సోదాలు..
* నేడు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్.. తెలంగాణలోని 190 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణ.. హైదరాబాద్ లో అత్యధికంగా 62 పరీక్ష కేంద్రాలు..
* నేడు నల్గొండ జిల్లాలో మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి పర్యటన.. కోదాడ, మిర్యాలగూడలో పలు అభివృద్ధి పథకాలపై సమీక్ష..
* నేడు తెలంగాణలో బీజేపీ ఆఫీస్ బేరర్ల కీలక సమావేశం.. అన్ని జిల్లాల అధ్యక్షుకు ఆహ్వానం పంపిన అధిష్టానం..
* నేడు హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన.. పద్మభూషన్ అవార్డు అందుకున్న సందర్భంగా సాయంత్రం బాలయ్యకు సన్మానం కార్యక్రమం..
* నేడు సింహాచలం ప్రమాదంపై ప్రాథమిక నివేదిక ఇవ్వనున్న కమిటీ..
* నేడు ఏపీలో అధికారికంగా భగీరథ మహర్షి జయంతి.. విశాఖలో విగ్రహం ఆవిష్కరించనున్న మంత్రి సవిత..
* నేడు తిరుమలలో స్థానిక కోటా దర్శన టోకెన్ల జారీ.. ప్రతి నెల మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శన టోకెన్లు..
* నేడు బొగ్గు గని కార్మికుల దినోత్సవం.. కార్మికుల కృషి, అంకితభావాన్ని గుర్తించాలని కోల్ మైనర్స్ డే నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం..
* నేడు ఐపీఎల్ లో రెండు మ్యాచ్ లు.. కోల్కతా వేదికగా మధ్యాహ్నం 3.30గంటలకి కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్.. ధర్మశాల వేదికగా రాత్రి 7.30 గంటలకి పంజాబ్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్..