Road Accidents: ప్రకాశం జిల్లాలోని ఒంగోలులోని కొప్పోలులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఒంగోలు మండలం కొప్పోలు సమీపంలో కారును వెనుక నుంచి లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. మరణించిన వారి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.
Read Also: Anthony Albanese: ఆస్ట్రేలియా ప్రధానిగా ఆంథోనీ అల్బనీస్
మరోవైపు, ఒంగోలు 16వ నెంబర్ జాతీయ రహదారిపై మూడు చోట్ల వరుస రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. వివిధ ప్రమాదాల్లో ఆరుగురు స్పాట్ లోనే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.. వారిని ఒంగోలు రిమ్స్ కు తరలించారు. కొప్పోలు దగ్గర మొదటి ప్రమాదంలో ముందు వెళ్తున్న కారును వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ముగ్గురు మరణించారు. ఇక, రెండవ ప్రమాదంలో ముందు వెళ్తున్న లారీని కోడిగుడ్ల లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టి బోల్తా పడింది.. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు. చివరగా.. మూడవ ప్రమాదంలో ఇన్నోవా, లారీ, ట్రాక్టర్ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రమాద ప్రదేశాన్ని పరిశీలించారు.