Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేత వల్లభనేని వంశీ మోహన్ అస్వస్థతకు గురయ్యారు.. వెంటనే విజయవాడ సబ్ జైలు నుంచి విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు జైలు అధికారులు.. బ్యాక్ పెయిన్, వాళ్లు వాయటంతో ఇబ్బంది పడుతోన్న వంశీని.. ఆస్పత్రికి తీసుకెళ్లారు జైలు అధికారులు.. బెజవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వల్లభనేని వంశీకి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు వైద్యులు..
Read Also: Tata vs MG: భారతీయ దిగ్గజ కంపెనీ టాటాకు సవాల్ విసురుతున్న చైనా కంపెనీ..?
కాగా, సత్యవర్ధన్‌ను భయపెట్టడం, కిడ్నాప్ చేసిన కేసులో వల్లభనేని వంశీ మోహన్‌ను హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన పోలీసులు.. విజయవాడ తరలించారు.. ఆ తర్వాత.. వంశీపై మరికొన్ని ఫిర్యాదులు రావడం.. కేసులు నమోదైన విషయం విదితమే.. ఇక, తాజాగా, గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. దాడి ఘటనలో ఫిర్యాదుదారు సత్యవర్థన్‌ను బెదిరించారని, కులం పేరుతో ధూషించారనే కేసును కొట్టివేసేందుకు నిరాకరించింది హైకోర్టు.. ఈ కేసులో వంశీ పాత్ర ఉన్నట్టు ప్రాథమిక ఆధారాలు ఉన్నందున కింది కోర్టు కూడా ఉత్తర్వులు ఇవ్వలేదని.. దర్యాప్తు దశలో బెయిల్ మంజూరు చేయడం సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసిన విషయం విదితమే.. మరోవైపు.. అస్వస్థతకు గురైన వల్లభనేని వంశీని జైలు నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన జైలు అధికారులు.. వైద్య పరీక్షల అనంతరం తిరిగి సబ్ జైలుకి తీసుకెళ్లారు..