Jobs Notification: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది.. ఇప్పటికే మెగా డీఎస్సీ సహా పలు రకాల పోస్టుల భర్తీకి సిద్ధమైన సర్కార్.. ఇప్పుడు ఏపీ ప్లానిండ్ డిపార్ట్‌మెంట్‌లో కాంట్రాక్ట్ పద్ధతిలో 175 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది.. ఎంబీఏ అర్హతగా.. యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు భర్తీ చేయనుంది.. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్, ప్రభుత్వ P4 కార్యక్రమ సమన్వయానికి.. కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు భర్తీకి సిద్ధమైన కూటమి ప్రభుత్వం.. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రస్తుతం ఏడాది కాలానికి ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.. ఆ తర్వాత పరిస్థితిని బట్టి పొడిగించే అవకాశం లేకపోలేదు..
Read Also: Kishan Reddy : తెలంగాణతో సంబంధం ఉన్న 5 కారిడార్‌లకు లక్ష కోట్లు
ఇక, ఏపీ ప్లానిండ్ డిపార్ట్‌మెంట్‌లో భర్తీ చేయనున్న 175 పోస్టుల భర్తీకి సంబంధించిన అర్హతలు, దరఖాస్తులు, వేతనానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎంబీఏ లేదా పీజీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.60 వేల వేతనాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది.. ఈ ఉద్యోగాలకు అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.. మే 13వ తేదీ దరఖాస్తులకు చివరితేది కాగా.. విద్యార్హతలు, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా పోస్టులను భర్తీ చేయనున్నారు.. 2025 మే 1వ తేదీ నాటికి అభ్యర్థికి 40 ఏళ్లకు మించకుండా ఉండాలి.. ఈ పోస్టులు సంబంధించిన అర్హతలు, దరఖాస్తులు, వేతం.. తదితర పూర్తి వివరాల కోసం https://apsdpscareers.com/YP.aspxలో చూసుకోవచ్చు..