మద్యం కుంభకోణంలో రేపు ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుఅవుతున్నారు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి.. అంటే నోటీసుల్లో పేర్కొన్న దానికంటే ఒకరోజు ముందుగానే విచారణకు వెళ్లబోతున్నారు.. ఈ మేరకు సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు సాయిరెడ్డి.. తొలుత ఈ నెల 18న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు సిట్ అధికారులు.. అయితే తనకు ముందుగా నిర్ణయించిన కార్యక్రమం ఉండటంతో 17వ తేదీన విచారణకు వస్తున్నానని సమాచారం పంపించారు విజయ సాయిరెడ్డి.. ఇక, 17వ తేదీన విచారణకు…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, అప్పులు, వడ్డీలపై 16వ ఆర్ధిక సంఘానికి వివరణ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అమరావతి రాజధానిపై స్పెషల్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర విభజన వల్ల వచ్చిన నష్టం.. కేంద్ర సాయంపై ప్రధానంగా సీఎం చంద్రబాబు వివరించారు... ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఏపీని ఆర్ధికంగా ఆదుకోవాల్సిన పరిస్థితిపై సీఎం చంద్రబాబు ప్రెజెంటేషన్ ఇచ్చారు.. గ్రామీణాభివృద్ధి.. పంచాయితీ రాజ్.. మున్సిపల్ శాఖలకు సంబంధించి కేంద్ర ఆర్థిక సంఘం నిధులు సిఫార్సు చేయాల్సిందిగా కోరారు…
ఏపీ ఫైబర్ నెట్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫైబర్ నెట్లో దాదాపు 500 మంది ఉద్యోగులను సర్కార్ తొలగిస్తూ సంచలన నిర్ణయానికి వచ్చింది.. సూర్య ఎంటర్ప్రైజెస్ ద్వారా నియమించిన వారందరు కూడా ఈ నెలాఖరుకు ఫైబర్ నెట్ నుంచి ఔట్ అవ్వనున్నారు..
క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. తిరుపతిలోని టీటీడీ ఎస్వీ గోశాలను పరిశీలించిన ఆయన.. గోవుల ఆరోగ్య పరిస్థితులు, గోవులకు అందుతున్న దాణాపై ఆరా తీశారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.. టిటిడి గోశాలలో సిబ్బంది నిర్లక్ష్యం ఎక్కడా లేదు, గోవులకు కావాల్సినంత దాణా ఉందని వెల్లడించారు.. ప్రతినిత్యం గోవుల ఆరోగ్యాన్ని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.. గోవులు పుష్టిగా ఆరోగ్యంగా ఉన్నాయని తెలిపారు.
Jagadish Reddy: తెలంగాణ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కృష్ణా నదీ జలాల వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యం, చేతకానితనాన్ని తీవ్రంగా విమర్శించారు. గత రెండు నెలలుగా తమ పార్టీ చెబుతోన్న వాదనల్ని ఇప్పుడు కృష్ణా బోర్డు కూడా సమర్థించిందని తెలిపారు. అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకు అక్రమంగా 65 టీఎంసీల నీటిని తీసుకెళ్లిందని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం నీళ్లను అక్రమంగా తరలిస్తుందన్న విషయం మేము…
ప్రవీణ్ పగడాల మృతిపై సీబీఐ విచారణ జరపాలంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.. ఆ పిల్‌పై విచారణ చేపట్టింది న్యాయస్థానం.. అయితే, ప్రవీణ్ ను హత్య చేశారని కోర్టుకు తెలిపారు పిటిషనర్ కేఏ పాల్.. మరోవైపు, రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్టు కోర్టుకు తెలిపింది ప్రభుత్వం.. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది హైకోర్టు..
ఇది విశాఖ విమాన ప్రయాణీకుల దుస్థితి.. "ఆంధ్రా to ఆంధ్రా via తెలంగాణ.." అంటూ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ చేసిన ట్వీట్ విపక్షాల చేతికి ఆయుధం ఇచ్చినట్టు అయ్యింది.. అయితే, గంటా వ్యవహారంపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయ్యింది.. విమాన సర్వీసులు జాప్యంపై మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ట్వీట్ పై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఏదైనా ఉంటే పార్టీ దృష్టికి తీసుకురావాలి.. లేకపోతే విమానయాన శాఖ మంత్రి కూడా మనవారే…
Minister Narayana: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిపై అనవసరంగా అపోహలు సృష్టిస్తున్నారు అని మంత్రి నారాయణ అన్నారు. అమరావతిపై లాంగ్ విజన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు అని పేర్కొన్నారు.