Minister Parthasarathy: అమరావతి అంటే వైసీపీకి కడుపు మంట..! వాళ్లు రాజధానిగా గుర్తించాల్సిన పనిలేదు..
- ఏపీ రాజధాని అమరావతి అంటే వైసీపీకి కడుపు మంట..
- రాజధాని పునఃప్రారంభ పనులు గొప్పగా మొదలయ్యాయి..
- అమరావతిపై విషం చిమ్మినవారు ఇప్పటికైనా పశ్చాత్తాపం వ్యక్తం చేయాలి..
- అమరావతిని రాజధానిగా రాష్ట్ర ప్రజలు గుర్తించారు..
- వైసీపీ గుర్తించాల్సిన అవసరం లేదన్న మంత్రి పార్థసారథి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Parthasarathy: ఏపీ రాజధాని అమరావతి అంటే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి కడుపు మంట అంటూ ఫైర్ అయ్యారు మంత్రి కొలుసు పార్థసారథి.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అమరావతి రీలాంచ్ కార్యక్రమంపై స్పందిస్తూ.. రాజధాని పునఃప్రారంభ పనులు గొప్పగా మొదలయ్యాయన్నారు.. అమరావతిపై విషం చిమ్మిన స్వార్థపరులు ఇప్పటికైనా పశ్చాత్తాపం వ్యక్తం చేయాలని సూచించారు.. అలా చేస్తే.. తెలుగు ప్రజలు క్షమించక పోయినా.. దేవుడు వారిని క్షమిస్తారని వ్యాఖ్యానించారు.. ఇక, అమరావతి రీలాంచ్ సభకు వచ్చేందుకు వాహనాలు సరిపోక వేలమంది గ్రామాల్లో ఉండిపోయారని తెలిపారు..
Read Also: Minister Seethakka : గొర్రెల స్కామ్‌పై సీతక్క ధ్వజం.. కేసీఆర్ పాలనలో స్కాములపై కఠిన చర్యలు తప్పవు..
Also Read
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
సభలో సీఎం చంద్రబాబు నాయుడు పనితీరుపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంపై ఆయనకు ఉన్న కమిట్‌మెంట్‌ను తెలియజేస్తాయన్నారు పార్థసారథి.. అమరావతి శక్తిని సాక్ష్యాత్తు ప్రధాని మోడీ గుర్తించి కీర్తించారు.. అమరావతి దేవతల రాజధాని అని మోడీ పేర్కొన్నారని గుర్తుచేశారు.. కానీ, అమరావతి భ్రమరావతి అని గత పాలకులు వ్యాఖ్యానించారని మండిపడ్డారు.. గత పాలకులు అమరావతి ప్రాధాన్యతను అవసరాన్ని ఇప్పటికైనా గుర్తించాలని సూచించారు.. ఇక, అమరావతి సభ సమయంలో అగ్ని ప్రమాదం వెనుక ఎవరైనా ఉంటే దానిపై పోలీసులు విచారణలో గుర్తిస్తారని తెలిపారు. అమరావతిని రాజధానిగా రాష్ట్ర ప్రజలు గుర్తించారు.. వైసీపీ గుర్తించాల్సిన అవసరం లేదు.. గుర్తించాలానే ఆలోచన విధానం వారికి లేదన్నారు.. అమరావతి అంటే వైసీపీకి కడుపు మంట అంటూ ఫైర్ అయ్యారకు.. మరోవైపు.. అమరావతికి చట్ట బద్దత కల్పించే అంశంపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు మంత్రి కొలుసు పార్థసారథి..
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!