Off The Record: సొంత ఇంట్లో అద్దెకున్నట్టు ఫీలవుతున్నారట పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో ఆయన తప్పుకోవాల్సి వచ్చింది. ఇక ఎన్నికల తర్వాత కొద్ది రోజులు జనసేనకు, వర్మకు వ్యవహారం బాగానే నడిచింది. కానీ… నెమ్మదిగా గ్యాప్ పెరిగింది. చివరికి అది ఏ స్థాయికి వెళ్ళిందంటే… కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడానికి కూడా ఇష్టపడడం లేదు రెండు వర్గాలు. ఎన్నికలకు ముందు, ఆ తర్వాత జనసేన కండువాలు కప్పుకున్నారు కొందరు వైసీపీ నాయకులు. కాకినాడ ఎంపీ ఉదయ్ అనుచరులుగా వాళ్లు మెయిన్ స్ట్రీమ్‌లో పనిచేస్తున్నారు. మరో వైపు ఈ మధ్యనే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే దొరబాబు గ్లాస్ పార్టీలో చేరారు. ఆయన వర్గం కూడా ప్రస్తుతం నియోజకవర్గంలో పట్టు సాధించే ప్రయత్నంలో ఉంది. ఇలా ఎన్నికల సమయంలో హ్యాండ్ ఇచ్చిన వాళ్లంతా ఇప్పుడు వచ్చి… తమ ఆధిపత్యం చూపించబోవడం టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు అస్సలు నచ్చడం లేదట.
Read Also: Sonam Raghuvanshi Case: ‘‘ఈ కేసు సమాజానికి గుణపాఠం’’.. హనీమూన్ మర్డర్‌పై సీఎం మోహన్ యాదవ్..
ఎన్నికల్లో పనిచేసిన వాళ్లని పక్కనపెట్టి ఓడించేందుకు ప్రయత్నించిన వాళ్ళని అందలం ఎక్కించడం ఎంతవరకు కరెక్ట్ అని వర్మ వర్గం ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. అసలే… హై ఫోకస్డ్ నియోజకవర్గం కావడంతో టీడీపీ అధిష్టానం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదట.. ఏదోటి తేల్చాలని వర్మ మొరపెట్టుకున్నా ఫలితం మాత్రం ఉండడం లేదంటున్నారు. గత వైసిపి ప్రభుత్వంలో నియోజకవర్గంలో వ్యవహారాలు చక్కబెట్టిన వాళ్ళు ఇప్పుడు కూడా యధావిధిగా తమ పనులు తాము చేసుకుంటున్నారట.. ప్రభుత్వం మారింది కాబట్టి అంతా తన చేతిలో ఉంటుందని ఆశించిన వర్మకు ఇప్పుడు పిఠాపురంలో జరుగుతున్న యవ్వారాలు అస్సలు మింగుడు పడటం లేదని చెప్పుకుంటున్నారు. ఇక్కడ పరిస్థితి అనుకూలంగా లేదు, అలాగని పార్టీ పెద్దలు చక్కబెట్టే పరిస్థితి కనిపించడం లేదు. అలాంటప్పుడు మన నిర్ణయం మనం ఎందుకు తీసుకోకూడదు, అసలెందుకు తగ్గాలని సన్నిహితుల దగ్గర అంటున్నారట వర్మ. మన ప్రభుత్వం వచ్చాక రివెంజ్ తీర్చుకుందామనుకుంటే…నాకే రిటర్న్ గిఫ్టులు ఇస్తున్నారని అనుచరులు దగ్గర అంటున్నట్టు సమాచారం. దాన్ని తట్టుకోవడానికి తనదైన స్టైల్‌లో ఓపెన్ అవుతున్నారచ మాజీ ఎమ్మెల్యే. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాల్ని ఎస్టాబ్లిష్ చేస్తే అందరూ ఓపెన్ అయిపోతారని భావిస్తున్నారట ఆయన.
Read Also: Group-1 Mains Results: గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల.. ఎస్సీ అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కీలక సూచన..
సాక్ష్యాధారాలతో ఇటు టీడీపీ, అటు జనసేన పెద్దలకు కనెక్ట్ అయ్యేలా కొట్టాలనుకుంటున్నట్టు సమాచారం. నియోజకవర్గంలో మట్టి, ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడంలేదని డైరెక్ట్‌గా ఫీల్డ్ లోకి వెళ్లిపోయారాయన. అధికారుల మీద వంకబెట్టి జనసేన నేతలను టార్గెట్ చేసేశారు. వాళ్ల పాత ఖాతాలు తన దగ్గర ఉన్నాయంటూ ఓపెన్ అయిపోయారాయన.. ఇప్పుడే మరీ… ఇంత అడ్వాన్స్ అయిపోవడం అవసరమా అని సన్నిహితులు బ్రేకులు వేసే ప్రయత్నం చేస్తున్నా… వాళ్ళకు కూడా క్లాస్ పీకుతున్నారట. అసలేమీ చేయకుంటే… మనల్ని మరీ చేతకాని వాళ్లు చేసేస్తారు. అలా జరక్కుండా ఉండాలంటే… ఇదే కరెక్ట్. వాళ్ళ నన్ను పట్టించుకోనప్పుడు నా పని నేను చేస్తానని అంటున్నట్టు సమాచారం. పార్టీ పెద్దలు వివరణ అడిగినా… వచ్చిన నష్టం ఏమీ లేదని, ముందు నేను చెప్పాను. వాళ్ళు లైట్ తీసుకున్నారు కాబట్టి మన వేలో మనం వెళ్ళాలి అంటున్నారట. అటు వర్మ కామెంట్స్‌కి జనసేన నేతలు కూడా అంతే సీరియస్‌గా రిప్లై ఇస్తున్నారు. తమరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వెలగబెట్టిన వ్యవహారాలేంటో కూడా చెప్పండి. అప్పుడు కూడా మేం మీతో కలిసి పని చేశాం అని రెట్టించి మరీ గుర్తు చేస్తున్నారట. మొత్తానికి మాజీ ఎమ్మెల్యే ఏదో అనుకుంటే ఏదో జరుగుతోంది. అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్టు ఆయన పరిస్థితి మారిందట.