ఇవాళ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో స్థానిక సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్.. ఈ సమావేశానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మున్సిపాలిటీ, అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపాలిటీ, కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు నగర పంచాయతీ, శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం వైసీపీ స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో భేటీ కానున్నారు.
ఏపీ బీజేపీ కేడర్ని ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తోందట. కార్యక్రమం ఏదైనాసరే.... ఆ... చూద్దాంలే, చెప్పినప్పుడు చేద్దాంలే అన్నట్టుగా ఉంటున్నారు తప్ప ద్వితీయ శ్రేణి నాయకులతో సహా... ఎవ్వరూ యాక్టివ్ రోల్ తీసుకోవడం లేదని చెప్పుకుంటున్నారు. ఇంతకు ముందులాగా... మేమున్నాం అంటూ పార్టీ కోసం ముందుకు రావడం లేదట. దీంతో చిన్న కార్యక్రమం చేయాలన్నా మందిని పోగేయడం పెద్ద టాస్క్గా మారిందని చెబుతున్నాయి ఏపీ బీజేపీ వర్గాలు.
ఏపీ లిక్కర్ స్కాం కేసులో వైసీపీ అధ్యక్షుడు జగన్ అరెస్ట్ అవబోతున్నారంటూ... జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో ఏ1 కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మొదలు... జగన్ కుడి, ఎడమలుగా చెప్పుకునే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వరకూ వచ్చింది అరెస్ట్ల పర్వం. ఇప్పటిదాకా ఏడుగురు అరెస్ట్ అవగా... దాదాపు అందరి విషయంలో ముందు లీకులు రావడం, తర్వాత లోపలికి వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలోనే... ఇంకేముంది రేపో మాపో జగన్ కూడా లోపలికి వెళ్ళడం ఖాయమంటూ టీడీపీ…
తెలుగుదేశం పార్టీ చరిత్రలో మొట్టమొదటిసారిగా... కడపలో మహానాడు కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహిస్తోంది. గురువారంతో.... ఈ మూడు రోజుల వేడుక ముగుస్తుంది. ఇక వచ్చే నెల 12తో కూటమి ప్రభుత్వం ఏడాదిపాలన పూర్తి చేసుకుంటుంది. ఈ క్రమంలో పూర్తి స్థాయి మార్పులు, చేర్పులకు సిద్ధమవుతున్నారట సీఎం చంద్రబాబు.
విజయనగరానికి చెందిన ఉగ్రవాది సిరాజ్ విచారణలో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. 5 రోజులుగా సిరాజ్ను ప్రశ్నిస్తున్న పోలీసులు, NIA అధికారులు... కుట్రకు సంబంధించిన విషయాలు కూపీ లాగుతున్నారు. హైదరాబాద్లో పేలుళ్లకు ప్లాన్ చేయాలని సిరాజ్కు... సౌదీ హ్యాండ్లర్ సూచించినట్టు తెలిసింది. అయితే... విజయనగరమే తన టార్గెట్ అని హ్యాండ్లర్కు చెప్పాడట సిరాజ్.
కడప జిల్లాలో టీడీపీ మహానాడు ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర అభివృద్ధి, కార్యకర్తల సంక్షేమం అనే అజెండాతో మొదటి రోజు మహానాడులో తీర్మానం ప్రవేశపెట్టారు. ఆరు ప్రధాన అంశాలను సభ ముందు ఉంచారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగం కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. అధికారికంగా ఎన్టీఆర్ జయంతి వేడుకులను జరపాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. ఇక నుండి ప్రతీ సంవత్సరం మే 28 తేదీన ఎన్టీఆర్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వేడుకగా నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం...
తిరుమల మెట్ల మార్గంలో మరోసారి చిరుతలు అలజడి సృష్టిస్తున్నాయి.. గతంలో భక్తులపై దాడి, ప్రాణాలు పోయిన ఘటనలు కూడా ఉండడంతో టీటీడీ అప్రమత్తమైంది.. నిపుణులతో సమావేశం నిర్వహించారు టీటీడీ ఈవో శ్యామలరావు... అలిపిరి మెట్ల మార్గంలో భక్తుల భద్రతకు అదనపు సిబ్బంది కేటాయించాలని నిర్ణయించారు. ఎప్పటికప్పుడు ఆరోగ్యశాఖ ద్వారా చెత్తను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని.. టీటీడీ అటవీ, రెవెన్యూ, పంచాయతీ రాజ్, ఆరోగ్య, విజిలెన్స్ శాఖలతో కలిసి అటవీ శాఖ సమన్వయంతో నడకమార్గంపై నిరంతర జాయింట్ డ్రైవ్…