* నేడు కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరుకానున్న మాజీ సీఎం కేసీఆర్.. ఉదయం 11.30 గంటలకు కమిషన్ ఎదుట హాజరుకానున్న కేసీఆర్.. ఉదయం 8గంటలకు ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ బయల్దేరనున్న కేసీఆర్..
* నేడు ములుగు జిల్లాలో పర్యటించనున్న మంత్రులు పొంగులేటీ, సీతక్క.. ఇంచర్లలో ఇందిరమ్మ కాలనీకి శంకుస్థాపన చేయనున్న మంత్రులు.. చల్వాయిలో భూభారతి రెవెన్యూ సదస్సుకు హాజరుకానున్న మంత్రులు సీతక్క, పొంగులేటీ..
* నేడు జగిత్యాలలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటన.. ఓల్డ్ బస్సు స్టాండ్ నుండి టౌన్ హాల్ వరకు నిర్వహించే ర్యాలీ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు.
* నేడు ఓబుళాపురం మైనింగ్ కేసు విచారణ తీర్పు వెల్లడించనున్న తెలంగాణ హైకోర్టు.. గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై ముగిసిన వాదనలు..
* నేడు ప్రకాశం జిల్లా పొదిలిలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన.. పొదిలి పొగాకు బోర్డును పరిశీలించనున్న జగన్.. గిట్టుబాటు ధరలపై ముఖాముఖి నిర్వహించనున్న జగన్..
* నేడు శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరం కాలేజ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి సత్యకుమార్ యాదవ్.
* నేడు, రేపు ఉమ్మడి కర్నూలు జిల్లాలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటన.. ఈరోజు కర్నూలు కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశం.. రేపు నంద్యాలలో పార్టీ కార్యకర్తలు, శ్రేణులతో ప్రత్యేక భేటీ..
* నేటితో ముగియనున్న శ్రీవారి వార్షిక జేష్ఠాభిషేకం ఉత్సవాలు.. ఇవాళ స్వర్ణ కవచంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీవారు.
* నేటి నుంచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్.. లార్డ్స్ వేదికగా మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభం కానున్న డబ్ల్యూటీసీ ఫైనల్ 2025.. ఈ బిగ్ ఫైట్ లో ఛాంపియన్ గా నిలవాలని పోటీ పడుతున్న సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు..