Off The Record: మారాయ్… రూల్స్ మారిపోయాయ్….. ఇకనుంచి ఎవరు పడితే వాళ్ళు వచ్చి సైకిలెక్కి కూర్చుంటే… వాళ్ళ పాపాలను మోస్తూ…. బరువును భరిస్తూ తొక్కడానికి మేం సిద్ధంగా లేమని అంటున్నారట టీడీపీ పెద్దలు. అందుకే పార్టీలో చేరాలనుకునే వాళ్ళకు కొత్త కండిషన్స్ పెడుతున్నట్టు తెలుస్తోంది. అది వైసీపీ నుంచి కావచ్చు. ఇతర ఏ పార్టీ నుంచైనా కావచ్చు… టీడీపీలో చేరాలంటే తప్పనిసరిగా కొన్ని షరతులకు లోబడి ఉండాల్సిందేనని అంటున్నారట. ఎవర్ని పడితే వాళ్ళని చేర్చుకుంటే పార్టీలోనే అంతర్గత సమస్యలు వస్తున్నట్టు గుర్తించిందట అధిష్టానం. మన పార్టీలో కోవర్టులు ఉన్నారంటూ… ఇటీవలే అన్నారు అధ్యక్షుడు చంద్రబాబు. మరీ ముఖ్యంగా కొత్తగా చేరుతున్న వాళ్ళతో సరికొత్త సమస్యలు వస్తున్నాయన్న అభిప్రాయం బలంగా ఉందట హైకమాండ్‌లో. అందుకే ఇకనుంచి ఎవరు పడితే వాళ్ళకు, ఎక్కడ పడితే అక్కడ పసుపు కండువాలు కప్పేయకుండా…. స్క్రూటినీ బాధ్యతను పార్టీ కేంద్ర కార్యాలయం చూసుకోవాలనుకుంటున్నట్టు సమాచారం.
Read Also: Dr K Laxman: పీసీసీ కార్యవర్గం ఏర్పాటుకు 18 నెలలు పట్టింది.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఎద్దేవా!
అక్కడ స్క్రూటినీ చేసి ఓకే అన్నాకే ఎంట్రీ ఉంటుందట. వాళ్ళు ఏ పార్టీ నుంచి వస్తున్నారో ఆ పార్టీలో క్లీన్‌చిట్ ఉండడం, వాళ్ళ మీద ఎలాంటి కేసులు లేకుండా ఉండటం, ఒకవేళ ఉన్నా… అవి ఇబ్బందికరమైనవా కాదా అన్న విషయాలన్నిటిమీద దృష్టిపెట్టి సంతృప్తి చెందితేనే గేట్లెత్తుతారట. కొత్తగా చేరే వాళ్ళవల్ల వచ్చే ఇబ్బందులు పార్టీ మెడకు చుట్టుకోకుండా ఉండటం కోసమే వీటన్నిటిమీద ఫోకస్ చేసినట్టు చెప్పుకుంటున్నారు. ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కొంతమంది వల్ల బాగా ఇబ్బంది పడ్డామన్న ఫీలింగ్ ఉందట ఎన్టీఆర్ భవన్ పెద్దలకు. ఆ తర్వాతినుంచే కండిషన్స్ అప్లయ్ అంటున్నట్టు సమాచారం. ఆ మధ్య పల్నాడులో జరిగిన టిడిపి నేతల హత్యలు కావచ్చు, ప్రకాశం జిల్లాలో జరిగిన మర్డర్ కావచ్చు.. అన్నీ ఈ కోవలోనివేనని భావిస్తున్నారట. నేర ప్రవృత్తితో ఇతర పార్టీల నుంచి టీడీపీలో చేరి తమ పాత కక్షలు తీర్చుకుంటున్నారన్న నిర్ణయానికి వచ్చారట సైకిల్ పెద్దలు. అలాంటి వాళ్ళ వల్ల శాంతిభద్రతల సమస్యతో పాటు… ఏకంగా పార్టీ కూడా బద్నాం అవుతోందన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో వ్యతిరేకంగా పని చేసి తీరా అధికారంలోకి వచ్చాక చేరుతున్న వారితోనే ఇబ్బందులు వస్తున్నట్టు గ్రహించారట టీడీపీ ముఖ్యులు.
Read Also: Off The Record: ఆ పోస్ట్ మాకొద్దు బాబోయ్..! అధికారులు హడలెత్తిపోతున్నారా..?
దీంతో పాటు ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు ఇప్పించే విషయంలో కూడా కొందరు పాత టీడీపీ నేతలు సాయపడుతున్న విషయం కూడా హైకమాండ్ దృష్టిలో ఉందట. ఇలా… రకరకాల కోణాల్లో ఆలోచించాక….చేరికలకు షరతులు వర్తిస్తాయని అంటున్నట్టు సమాచారం. రాబోయే రోజుల్లో…. పార్టీని మరింత పటిష్టం చేయాలన్నా…. ఇమేజ్ పాడవకుండా ఉండాలన్నా… ఇలాంటి రూల్స్ మస్ట్ అంటున్నారట తెలుగుదేశం ముఖ్యులు. సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబే… కోవర్టులు పెరిగిపోయారని అన్నారంటే… టిడిపిలో పరిస్థితి ఏరకంగా ఉంది, ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఎలా వ్యవహరిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చన్న చర్చ జరుగుతోందట పార్టీ వర్గాల్లో. అందుకే నేర ప్రవృత్తి లేకపోవడం, పార్టీలోకి వచ్చిన వెంటనే పదవులు ఆశించకుండా ఉండడంలాంటి నిబంధనలు పెడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. రాజకీయాల్లో ఇలాంటి రూల్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలంటున్నారు పరిశీలకులు.