భూముల మార్కెట్ ధర సవరణ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… ఏడాది పాటు భూముల మార్కెట్ ధరలను సవరించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది… వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు భూముల మార్కెట్ ధరలను సవరించేదే లేదని స్పష్టం చేసింది… కరోనా మహమ్మారి వల్ల ప్రజలకు ఇబ్బందులుండడంతో భూముల మార్కెట్ ధరల విషయంలో సవరణ చేయకూడదని ప్రభుత్వం భావించగా.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ.. దీంతో..…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా లక్షా 13 సాంపిల్స్ పరీక్షించగా.. 3,040 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. మరో 14 మంది కరోనా బాధితులు మృతిచెందారు.. తూర్పు గోదావరిలో నలుగురు, చిత్తూరులో ఇద్దరు, అనంతపూర్, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరిలో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు.. ఇక, ఇదే సమయంలో 4,576 మంది పూర్తిస్థాయిలో…
కర్నూలు వేదికగా జరిగిన బీజేపీ రాయలసీమ స్థాయి సమావేశం ముగిసింది.. సాగునీటి ప్రాజెక్టులు, అభివృద్ధిపై చర్చించారు నేతలు.. ఇక, సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. ఏపీ, తెలంగాణ సీఎంలపై సంచలన ఆరోపణలు చేశారు.. కేసీఆర్, జగన్ మూడు ముక్కలాట ఆడుతున్నారని కామెంట్ చేసిన ఆయన.. రాత్రి ఫోన్లో మాట్లాడుకుంటారు.. పగలు ఉత్తరాలు రాస్తారంటూ విమర్శించారు.. ఏపీ సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం రోజున కేసీఆర్ చెప్పింది ఒకటి.. ఇప్పుడు చేస్తున్నదొకటి.. ఏపీ,…
కడప జిల్లాకు నేను ఎంత చేసినా తక్కువే… జిల్లాకు ఏమి ఇచ్చినా ప్రజల రుణం తీర్చుకోలేనిది అన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్… జిల్లాలో పర్యటిస్తున్న సీఎం.. ఇవాళ కడపలోని మహావీర్ సర్కిల్ లో రూ.459 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన శంకుస్థాపనల శిలాఫలకాలను ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన సీఎం.. కడప నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు గతం కంటే అతి వేగంగా జరుగుతున్నాయన్నారు.. నగరంలోని రోడ్లు…
ఆస్తుల కోసం పోరాటం కాదు… హక్కు కోసం పోరాడుతున్నామని.. ఆట ఇప్పుడే మొదలైందన్నారు మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ.. కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆమె.. గర్భవతిని కాబట్టే ఇంతకాలం బయటికి రాలేదు… డాక్టర్ సలహా మేరకే ఇప్పుడు బయటికి వచ్చి మాట్లాడుతున్నా.. భూమా నాగిరెడ్డి ఆస్తులు, అభిమానులు, కార్యకర్తలతోపాటు శత్రువులను కూడా వారసత్వంగా తీసుకోవాల్సి వస్తుందన్నారు.. దమ్ము, ధైర్యం, సిగ్గు, శరం ఉంటే నన్ను డైరెక్ట్ గా ఎదుర్కొండి.. కానీ, తప్పుడు కేసులతో పోలీసులను…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 91,070 సాంపిల్స్ పరీక్షించగా… 2,982 మందికి పాజిటివ్‌గా తేలింది.. మహమ్మారితో మరో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే, సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 3,461 మంది కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్రభుత్వం. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,14,213కు చేరుకోగా… రికవరీ కేసులు 18,69,417కు పెరిగింది.. ఇక, ఇప్పటి…
ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల మధ్య జల జగడం రోజురోజుకీ మరింత ముదురుతూనే ఉంది… కేంద్రానికి వరుసగా లేఖలు రాస్తూనే ఉంది ఏపీ.. తాజాగా,, మరో లేఖ కేంద్రానికి వెళ్లింది.. తెలంగాణ ప్రభుత్వం కృష్ణానదిపై నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను నిలువరించాలని కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాశారు ఏపీ ఇరిగేషన్ కార్యదర్శి శ్యామల రావు.. భారీ ప్రాజెక్టులు, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టులతో ఏపీకి దక్కాల్సిన నీటి వాటాను కాజేస్తోందని ఫిర్యాదు చేశారు.. 8 భారీ ప్రాజెక్టుల ద్వారా 183…
జార్ఖండ్ నుండి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు ఏర్పడిన ఉత్తర-దక్షిణ ఉపరితల ద్రోణి ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతం మరియు దానిని ఆనుకుని ఉన్న ఒడిస్సా & పశ్చిమబెంగాల్ తీరప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుండి దక్షిణకోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు సముద్రమట్టము నుండి 3.1 km ఎత్తు వద్ద కొనసాగుతుంది. జూలై 11 న ఉత్తర ఆంధ్ర ప్రదేశ్- దక్షిణ ఒడిస్సా తీరాలకు దగ్గరలో పశ్చిమ మధ్య & దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలలో అల్పపీడనం ఏర్పడే…
ఏపీ సీఎం వైఎస్ జగన్.. కేంద్రానికి లేఖలు రాయడం దొంగే దొంగా.. దొంగా అన్నట్లుగా ఉందంటూ ఫైర్ అయ్యారు తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి… పోతిరెడ్డిపాడు నుంచి అక్రమంగా నీటిని తొడుకు పోతున్నారని ఆరోపించిన ఆయన.. వైఎస్ జగన్ ప్రభుత్వం 203 జీవోను వెనక్కి తీసుకొని, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు.. వరద జలాల పేరుతో శ్రీశైలం ప్రాజెక్టు నీళ్లను ఇన్నాళ్లు అక్రమంగా తీసుకుపోయారు… ఇక, వారి ఆటలు సాగవన్న ఆయన.. సీఎం…