సస్పెన్స్ హారర్ థ్రిల్లర్‌గా “జిన్” అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డైరెక్టర్ చిన్మయ్ రామ్ ఈ చిత్రాన్ని వైవిధ్యభరితమైన కథతో రూపొందించారు. ఆసక్తికరమైన సబ్జెక్ట్‌ను తీసుకొని, అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చిన్మయ్ రామ్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో అమిత్ రావ్ హీరోగా నటిస్తున్నారు. సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిఖిల్ ఎమ్ గౌడ నిర్మిస్తున్నారు. వరదరాజ్ చిక్కబళ్లాపుర డైలాగ్స్ అందించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, వీడియోలు ప్రేక్షకులను ఆకట్టుకొని, సినిమాపై అంచనాలు పెంచాయి. “జిన్” అనే టైటిల్ కూడా కథ లాగే వైవిధ్యంగా ఉండటం సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్. ఈ టైటిల్ ద్వారా సినిమా సులభంగా ప్రేక్షకులకు రీచ్ అయ్యే అవకాశం ఉంది.
Also Read : Akhanda 2: హైకోర్టులో షాక్… అయినా ప్రీమియర్స్ ఆన్ ట్రాక్.. పుకార్లను నమ్మవద్దు!
మంచి హైప్ నడుమ ఈ చిత్రాన్ని తెలుగులో డిసెంబర్ 19న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. హైదరాబాద్‌తో పాటు కథకు సరిపోయే పలు లొకేషన్స్‌లో ఈ సినిమా షూటింగ్ జరిగింది. సినిమా నిర్మాణంలో నిర్మాతలు ఎక్కడా ఖర్చుకు వెనకాడలేదట. చిత్ర బృందం ఎంతో నమ్మకంగా… “స్ట్రాంగ్ కంటెంట్, దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం చాలా బాగుంది. ఈ మూవీ థియేటర్లలో సూపర్ సక్సెస్ కావడం పక్కా” అని చెబుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ హారర్ మూవీస్ ఎన్నో చూసినప్పటికీ, ‘జిన్’ వాటిలో డిఫరెంట్‌గా ఉంటుందని యూనిట్ అంటోంది.