ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో అర్థరాత్రి డ్రోన్లు కలకలం సృష్టించాయి… శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ పరిసరాల్లో ఆకాశంలో అనుమానాస్పదంగా డ్రోన్ కెమెరాలు చక్కర్లు కొట్టినట్టు చెబుతున్నారు.. డ్రోన్ల కదలికలను గుర్తించిన పోలీసులు, ఆలయ సిబ్బంది వాటిని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేసినా అవి చిక్కలేదు.. అయితే, నాలుగు రోజులుగా రాత్రిపూట ఆలయ పరిసరాల్లో ఆకాశంలో డ్రోన్లు ఎగురుతున్నట్టుగా గుర్తించారు పోలీసులు… అర్ధరాత్రి పూట డ్రోన్లు తిరగడంతో శ్రీశైలంలో ఏమి జరుగుతుందోనని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు స్థానికులు, భక్తులు..…
తెలుగు రాష్ట్రాల మధ్య వాటర్ వార్ సాగుతోన్న సమయంలో ఇరు రాష్ట్రాల సీఎంలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి.. ఇవాళ ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న నారాయణ స్వామి.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ మంచి ఆలోచన అభిమానంతో ఆంధ్రకి సహకరిస్తామన్నారు.. రాయలసీమ జిల్లాలకు నీరు అందించాలని ఆకాంక్షించారు. తెలుగు రాష్ర్టాల్లో ప్రజలు తల్లిబిడ్డలు కలిసి ఉన్నారని… సీఎం జగన్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే అభిమానం.. కేసీఆర్‌కి కూడా జగన్…
గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలంలోని జానపాడు చెందిన శిరీష అంతరిక్షంలోకి అడుగు పెట్టబోతోంది. అంతేకాదు.. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు అమ్మాయిగానూ నిలిచింది. అంతరిక్షంలోకి వెళ్లనున్న నాలుగో భారతీయురాలిగా గుర్తింపును సొంతం చేసుకోనున్నారు. ఈ నెల 11వ తేదీన తెల్లవారు జామున ఈ స్పేస్‌క్రాఫ్ట్ నింగిలోకి దూసుకెళ్తుంది. ఆరుగురు పరిశోధకులతో కూడిన బృందంలో శిరీష ఒకరు. టీమ్‌లో ఆమెతో పాటు ఇంకొక మహిళ ఉన్నారు. కాగా శిరీషకు ప్రముఖులు అభినందనలు తెలుపుతూ టీమ్ సక్సెస్ అవ్వాలని…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు, మృతుల సంఖ్య క్రమంగా కిందికి దిగుతోంది… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 90,532 సాంపిల్స్‌ను పరీక్షించగా… 2,930 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.. మరో 36 మంది కరోనా బాధితులు కన్నుమూశారు.. చిత్తూరులో ఆరుగురు, తూర్పు గోదావరి, గుంటూరు, కర్నూల్లో నలుగురు చొప్పున, కడప, ప్రకాశం, శ్రీకాకుళంలో ముగ్గురు చొప్పున, అనంతపూర్, కృష్ణా, విశాఖలో ఇద్దరు చొప్పున, నెల్లూరు, విజయనగరంలో…
కృష్ణా జలాల పంపిణీ, కొత్త ప్రాజెక్టుల విషయంలో ఏపీ, తెలంగాణ మంత్రుల మధ్య మాటల తూటాలు పేలుతుండగా… ఈ వ్యహారంపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు… తెలంగాణపై మండిపడ్డారు.. ఏపీకి నీటి కేటాయింపులపై తెలంగాణ ప్రభుత్వం ఒంటెద్దు పోకడలు అవలంభిస్తోందన్న ఆయన.. తెలంగాణ ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నట్టు తెలిపారు.. దీనిపై రేపు కర్నూలు వేదికగా.. రాయలసీమ బీజేపీ నేతలతో సమావేశం నిర్వహిస్తున్నామని వెల్లడించారు.. మరోవైపు.. రాష్ట్రంలో జగనన్న ఇళ్లు అర్జెంటుగా కట్టేయాలంటూ లబ్ధిదారను ఇబ్బంది…
జల జగడం రోజురోజుకీ తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రుల మధ్య మాటల దాడిని పెంచుతోంది.. తాజాగా.. ఈ వ్యవహారంలో స్పందించిన తెలంగాణ ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్.. తెలంగాణకు ఎక్కడ అన్యాయం జరిగిన ఊరుకునే ప్రసక్తేలేదు.. ప్రాణాలు పోయినా పోరాడుతామని వ్యాఖ్యానించారు.. తెలంగాణకు ఎవరు నష్టం చేసినా పార్టీలకు అతీతంగా ఐక్యం కావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చిన ఆయన.. తెలంగాణ నీళ్లను ఎవరు దోసుకపోయినా అడ్డం నిలబడాలని.. తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు కించపరిచేలా మాట్లాడినా అందరం ఏకతాటిపైకి…
ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య జల జగడం కొనసాగుతూనే ఉంది… ఈ వ్యవహారంలో ఇరు రాష్ట్రాల మంత్రుల వ్యాఖ్యలు మరింత హీట్ పుట్టిస్తున్నాయి… తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్… తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర విభజనే మనకు పెద్ద నష్టం అన్నారు.. చంద్రబాబు చేసిన తప్పిదాల వల్లే నేటికీ ఇబ్బంది పడుతున్నామన్న ఆయన.. విభజన చట్టంలో ఉన్న నియమనిబంధనలకే మేం ఇప్పటికీ కట్టుబడి ఉన్నామన్నారు.. తెలంగాణ నేతలకు కూడా మేం అదే చెబుతున్నాం.. జలవివాదాలను…
పాత చింతకాయ పచ్చడిలా ఉండే ఏపీ బీజేపీ నేతలు.. రూటు మార్చారా? చేస్తున్నదానికీ.. చేయాల్సిన దానికీ తేడా తెలుసుకున్నారా? రెండేళ్ల తర్వాత ఇప్పుడు లైన్లోకి వెళ్లారా? ఏపీ ప్రభుత్వంపై బీజేపీ సమావేశంలో తీవ్ర విమర్శలు! ఏపీ బీజేపీలో రకరకాల గ్రూపులు. అంతా పార్టీ విధేయులైనా ఆయా అంశాలపట్ల ఎవరి తీరు వారిదే. ప్రభుత్వంతో ఎలా ఉండాలి? ప్రధాన ప్రతిపక్షంతో ఎలా వ్యవహరించాలన్న విషయంలోనూ ఎవరి గ్రూప్ వారిదే. అయితే కొద్దిరోజుల క్రితం జరిగిన బీజేపీ రాష్ట్ర కమిటీ…
భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన నలుగురు బంగ్లాదేశ్‌కు చెందిన యువకులను అరెస్ట్ చేవారు బెజవాడ పోలీసులు.. పోలీసుల విచారణలో తుల్లానా జిల్లా నుండి భారత్‌లోకి ప్రవేశించినట్టుగా తెలిపారు.. ఆ తర్వాత హావ్ డా – వాస్కోడిగామా రైలులో వెళ్తుండగా బెజవాడలో అదుపులోకి తీసుకున్నారు రైల్వే పోలీసులు.. పాస్ పోర్ట్ లేకుండా నల్లాల ద్వారా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించినట్టు గుర్తించారు.. దర్బంగా ఘటనతో అప్రమత్తమైన పోలీసులు.. అసలు ఆ యువకులు ఏపీలోకి రావడానికి గల కారణాలపై లోతుగా దర్యాప్తు చేపట్టారు..…