ఆస్తుల కోసం పోరాటం కాదు… హక్కు కోసం పోరాడుతున్నామని.. ఆట ఇప్పుడే మొదలైందన్నారు మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ.. కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆమె.. గర్భవతిని కాబట్టే ఇంతకాలం బయటికి రాలేదు… డాక్టర్ సలహా మేరకే ఇప్పుడు బయటికి వచ్చి మాట్లాడుతున్నా.. భూమా నాగిరెడ్డి ఆస్తులు, అభిమానులు, కార్యకర్తలతోపాటు శత్రువులను కూడా వారసత్వంగా తీసుకోవాల్సి వస్తుందన్నారు.. దమ్ము, ధైర్యం, సిగ్గు, శరం ఉంటే నన్ను డైరెక్ట్ గా ఎదుర్కొండి.. కానీ, తప్పుడు కేసులతో పోలీసులను అడ్డుపెట్టుకొని వేధించాలనుకోవద్దు అన్నారు..
ఇక, బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసు కోర్టులో ఉంది.. దానిపై తర్వాత వివరణ ఇస్తానన్నారు అఖిలప్రియ.. నిన్నటి కేసులపై వివరణ ఇవ్వాల్సి ఉందన్న ఆమె.. పోలీసుశాఖపై గౌరవం ఉంది.. కానీ, కొందరు పోలీసులు తమను ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. కొన్ని రోజుల క్రితం పక్క రాష్ట్రం వెళ్లొచ్చినందుకు హెల్త్ బాగా లేకుంటే కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారు.. టెస్ట్ చేయించుకున్న కొన్ని గంటలకే పోలీసులు వచ్చి పోలీస్ స్టేషన్ కు రమ్మని ఇంటికి వచ్చారు… కరోనా టెస్టు కోసం సహకరించలేదని పోలీసులు అంటున్నారు.. వారి మీద నమ్మకం లేక మేమే టెస్టు చేయించుకుంటామని చెప్పామన్నారు.. కానీ, ల్యాబ్ వాళ్లు మాకు ఒక రిపోర్టు, పోలీసులకు మరో రిపోర్టు ఎందుకిచ్చారో తెలియదన్నారు అఖిలప్రియ.. ల్యాబ్ వాళ్లను కొట్టి, హింసించారని మాకు సమాచారం ఉందన్న ఆమె.. మాపై వరుసగా తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని.. నా భర్తను ఐడెంటిఫికేషన్ కోసం రమ్మని కోర్టుకు పిలుస్తున్నారని.. కిడ్నాప్ ఘటనలో నా భర్త ఉంటే ఈ రోజు మళ్లీ ఐడెంటిఫికేషన్ కోసం ఎందుకు రమ్మంటున్నారు ? అని ప్రశ్నించారు. గతంలో నా భర్త కోర్టుకు వెళ్లారు… అప్పుడు పోలీసులు రాలేదన్నారు. ఇక, మాపై కేసులకు రాజకీయాలకు సంబంధం లేదన్న అఖిలప్రియ.. తెలంగాణలో టీఆర్ఎస్‌కు, ఇక్కడ పార్టీలకు మా కేసులతో సంబంధం లేదన్నారు. అయితే, ఈ కేసులో.. పోలీసులు అధికారులు ఎలా హింసిస్తున్నారో.. ఎలా కేసును తప్పుదోవ పట్టిస్తున్నారో ఆధారాలతో కేసీఆర్, కేటీఆర్‌కు లేఖ రాస్తానని.. తెలంగాణలో ఒకరిద్దరు వ్యక్తులు మాత్రమే పోలీస్ శాఖను అడ్డు పెట్టుకొని మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారని తెలిపారు.