కేసీఆర్, జగన్‌ది మూడు ముక్కలాట.. రాత్రి ఫోన్లు.. పగలు ఉత్తరాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్నూలు వేదికగా జరిగిన బీజేపీ రాయలసీమ స్థాయి సమావేశం ముగిసింది.. సాగునీటి ప్రాజెక్టులు, అభివృద్ధిపై చర్చించారు నేతలు.. ఇక, సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. ఏపీ, తెలంగాణ సీఎంలపై సంచలన ఆరోపణలు చేశారు.. కేసీఆర్, జగన్ మూడు ముక్కలాట ఆడుతున్నారని కామెంట్ చేసిన ఆయన.. రాత్రి ఫోన్‌లో మాట్లాడుకుంటారు.. పగలు ఉత్తరాలు రాస్తారంటూ విమర్శించారు.. ఏపీ సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం రోజున కేసీఆర్ చెప్పింది ఒకటి.. ఇప్పుడు చేస్తున్నదొకటి.. ఏపీ, తెలంగాణ మధ్య ఎలాంటి వివాదాలు ఉండవని, కృష్ణ జలాలను ఒప్పందం ప్రకారం పంచుకుంటామని కేసీఆర్ అన్నారని.. కానీ, ఆ మాటను కేసీఆర్ మర్చిపోయారా? గుర్తు చేయడానికి జగన్ సిగ్గుపడుతున్నారా..? అని ప్రశ్నించారు.
కృష్ణ జలాలపై సీఎం జగన్ ఎందుకు మౌనం వహిస్తున్నారు అని ప్రశ్నించారు సోము వీర్రాజు.. తెలంగాణ విషయంలో మాట్లాడబోమని సజ్జల ఎందుకు అంటున్నారు? అని నిలదీసిన ఆయన.. విభజన సమయంలో ఏపీకి చాలా నష్టం జరిగింది.. రాజధాని నష్టపోయాం, భద్రచలం వదులుకున్నాం.. ఆదాయం కోల్పోయామన్నారు.. సోనియాగాంధీ కాళ్లు పట్టుకొని భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మండలాలను కేసీఆర్ తెలంగాణలో కలుపుకున్నారన్న ఆయన.. ఏపీకి నష్టం జరుగుతున్నా జగన్ ఎందుకు మాట్లాడడం లేదని ఫైర్ అయ్యారు.. ఇక, ఏపీకి అన్యాయం జరగకుండా బీజేపీ ప్రయత్నిస్తోంది.. చుక్క నీరు వదులుకోమని ప్రకటించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు.. జగన్, కేసీఆర్ తెలివిగా ఉత్తరాలు రాసుకుంటున్నారని విమర్శించిన ఆయన.. కేఆర్‌ఎంబీ ముందు వాదనలు వినిపించకుండా మాట్లాడమంటే ఎలా…? అని ప్రశ్నించారు. మరోవైపు వివాదాలు లేని పెండింగ్ ప్రాజెక్టులు ఎన్నో వున్నాయి… అవి ఎందుకు పూర్తి చేయడం లేదని నిలదీశారు.. ఏపీ పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి బీజేపీ ఉద్యమం చేస్తుందని.. త్వరలో విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు సోము వీర్రాజు.
Also Read
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!