Bangladesh: బంగ్లాదేశ్ ఎన్నికల డేట్ ఫిక్స్.. హసీనా పదవీచ్యుతి తర్వాత తొలి ఎలక్షన్స్..
- బంగ్లాదేశ్ ఎన్నికలకు డేట్ ఫిక్స్..
- షేక్ హసీనా రాజీనామా తర్వాత తొలి ఎన్నికలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్‌లో కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత, తొలిసారిగా సార్వత్రిక ఎన్నికలకు తేదీలు ఖరారయ్యాయి. బంగ్లా 13వ జాతీయ పార్లమెంటరీ ఎన్నికలను 2026, ఫిబ్రవరి 12 నిర్వహించనున్నట్లు ఆ దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీరుద్దీన్ దేశ ప్రజల్ని ఉద్దేశిస్తూ ఈ ప్రకటన చేశారు. స్వేచ్ఛాయుతమైన, ప్రజాస్వామ్యబద్ధమైన ఓటింగ్ నిర్వహించగలమని ప్రపంచానికి నిరూపించేందుకు దేశం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. నకిలీ వార్తలు, పుకార్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజల్ని కోరారు.
Read Also: Rahul Gandhi: అమిత్ షా ఒత్తిడిలో ఉన్నారు, అందుకే తప్పుడు భాష వాడారు..
Also Read
సార్వత్రిక ఎన్నికలు, జూలై చార్టర్ ప్రజాభిప్రాయ సేకరణకు ఓటింగ్ ఫిబ్రవరి 12న ఏకకాలంలో జరుగుతుందని ఎన్నికలక కమిషనర్ తెలిపారు. మొత్తం 300 పార్లమెంటరీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ప్రవాస బంగ్లాదేశీయులు రేపటి నుంచి డిసెంబర్ 25 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకునేందుకు గడువు ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారం, నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 29, 2025 (సోమవారం). నామినేషన్ పత్రాల పరిశీలన డిసెంబర్ 30, 2025 (మంగళవారం) నుండి జనవరి 4, 2026 (ఆదివారం) వరకు జరుగుతుంది. అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి జనవరి 20, 2026 (మంగళవారం) వరకు సమయం ఉంటుంది.
గతేడాది ఆగస్టులో హింసాత్మక నిరసనల తర్వాత షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చారు. అప్పటి నుంచి ఆమె భారత్‌లోనే ఆశ్రయం పొందుతున్నారు. బంగ్లాదేశ్‌లో మహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. ఎన్నికలు నిర్వహించే వరకు యూనస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. మరోవైపు, యూనస్ హయాంలో షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ, దాని కార్యకర్తలపై అణిచివేత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈసారి బంగ్లా ఎన్నికల్లో ఖలీదా జియాకు చెందిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ), మతతత్వ జమాతే ఇస్లామీ పార్టీలు కీలకం కాబోతున్నాయి.
తాజావార్తలు
-
Jantar Mantar: కన్నీళ్లకు సాక్షి.. విప్లవాలకు వేదిక.. జంతర్ మంతర్ కథ ముగిసినట్టేనా?
-
Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
-
Tilak Varma: అంత నిర్లక్షమా.. బీచ్లో వాకింగ్ చేస్తున్నావా ఏంటి?.. తెలుగు ఆటగాడిపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!