ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా లక్షా 13 సాంపిల్స్ పరీక్షించగా.. 3,040 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. మరో 14 మంది కరోనా బాధితులు మృతిచెందారు.. తూర్పు గోదావరిలో నలుగురు, చిత్తూరులో ఇద్దరు, అనంతపూర్, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరిలో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు.. ఇక, ఇదే సమయంలో 4,576 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,17,253కు పెరగగా… రికవరీ కేసులు 18,73,993కు చేరాయి.. ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి 12,960 మంది మృతిచెందగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 30,300 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. కోవిడ్ టెస్ట్‌ల సంఖ్య 2,27,99,245గా ఉందని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.