కాంగ్రెస్, బిజెపిలకు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో రాజకీయాలు కావాలని.. కానీ టీఆరెస్ కు మాత్రం ఒకే ఒక్క రాష్ట్రం అదే తెలంగాణ అని కేటీఆర్ చెప్పారు. కృష్ణా జలాల విషయంలో టీఆరెస్ పార్టీ అనుకున్నది సాధిస్తుందని స్పష్టం చేశారు కేటీఆర్. హైదరాబాద్ చుట్టు పక్కల మున్సిపాలిటీ లు, కార్పొరేషన్ ల పరిధిలో మరింత అభివృద్ధి చేసేందుకు మంత్రి సబితా, మల్లా రెడ్డికి బాధ్యతలు అప్పగించామన్నారు. read also : వంద మంది సీఎంలు వచ్చినా ఈటల…
ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు రాష్ట్రాలు, జిల్లాల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నాడని… ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు రాసిన లేఖ దాన్ని స్పష్టం చేస్తోందని మండిపడ్డారు. తెలుగు దేశం కాస్త… తెలంగాణ దేశం పార్టీగా అవతరిస్తోందని నిప్పులు చెరిగారు. గుండ్లకమ్మ, రామతీర్థం వంటి అనేక ప్రాజెక్టులు వైఎస్సార్ చేశారని… చంద్రబాబు తన ప్రాంతానికి ఏమి చేశాడో చెప్పాలని చురకలు అంటించారు. read also :…
చంద్రబాబు రెండు రాష్ట్రాలు, జిల్లాల మధ్య చిచ్చు పెడుతున్నారు అంటూ మండిపడ్డారు ఏపీ జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు రాసిన లేఖ దాన్ని స్పష్టం చేస్తోందని విమర్శించారు.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. గుండ్లకమ్మ, రామతీర్థం వంటి అనేక ప్రాజెక్టులు వైఎస్సార్ చేశారని.. చంద్రబాబు తన ప్రాంతానికి ఏమి చేశాడో చెప్పాలి? అని డిమాండ్ చేశారు.. వైఎస్ జగన్ వచ్చాక వెలిగొండ మొదటి టన్నెల్ పూర్తి చేసి రెండో టన్నెల్…
రాయలసీమ ఎత్తిపోతలపై తెలంగాణ సర్కార్ ధిక్కరణ పిటిషన్ వేసింది. ఈ ధిక్కరణ పిటిషన్ను ఎన్జీటీలో ప్రస్తావించింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ తరఫున ప్రస్తావించారు ఏఏజీ రామచందర్రావు. గతంలో ధిక్కరణ పిటిషన్ వేసిన గవినోళ్ల శ్రీనివాస్… ఎన్జీటీలో నేడు విచారణకు రాలేదు. దీంతో ధిక్కరణ పిటిషన్ వేశామని ఎన్జీటీకి తెలిపారు తెలంగాణ ఏఏజీ రామచందర్రావు. నేడు నివేదిక సమర్పించాల్సి ఉన్న కేఆర్ఎంబీ, కేంద్ర పర్యావరణశాఖ రాయలసీమ ఎత్తిపోతలను సందర్శించిన నివేదికను ఎన్జీటీ ఇవ్వాలని పేర్కొంది. read also :…
ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులినెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 66,657 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 1578 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి, 22 మంది మృతిచెందారు.. read also : ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల టీచర్లు అందరికీ వాక్సినేషన్ మరోవైపు.. 24 గంటల్లో 3,041 మంది పూర్తి స్థాయిలో కోలుకున్నారు.. దీంతో… ఏపీలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల…
ఏపీ సీఎం జగన్ ఇవాళ కరోనా పరిస్థితులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సడలింపులు ఇస్తున్నట్టు సీఎం జగన్ పేర్కొన్నారు. రాత్రి 9 వరకు దుకాణాలు మూసివేయాలని అన్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని అన్నారు. సడలింపుల సమయంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు…
ఉత్తర ఆంధ్ర ప్రదేశ్-దక్షిణ ఒడిస్సా తీరాలకు దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం & దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలలో ఈరోజు అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధముగా ఉపరితల ఆవర్తనం మధ్యస్థ ట్రోపో స్పియరిక్ స్థాయిల వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశ వైపు వంగి ఉన్నది. పశ్చిమ రాజస్థాన్ మధ్య ప్రాంతాల నుండి తూర్పు రాజస్థాన్, మధ్యప్రదేశ్, దక్షిణ ఛత్తీస్ ఘడ్, ఒడిస్సా మరియు ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్ ల మీదుగా…
అందాల అరకు లోయ చాలా కాలం తరువాత పర్యాటకులతో కళకళలాడుతున్నది. ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఆంక్షలను సడలిస్తూ వస్తున్నారు. ఆంక్షలు క్రమంగా సడలిస్తుండటంతో అన్ని రంగాలు క్రమంగా తెరుచుకుంటున్నాయి. మూడు నెలల క్రితం మూతపడిన పర్యాటక రంగం తిరిగి తెరుచుకున్నది. రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకు వ్యాలీకి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తున్నారు. Read: తెలంగాణ ప్రజలకు మెగాస్టార్ విషెష్ వారాంతపు సెలవులు కావడంతో అరకు వెళ్లి అక్కడ సేదతీరేందుకు పర్యాటకులు…