ఎంపీ రఘురామ కృష్ణరాజు వ్యవహారంపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశామని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అన్నారు. రఘురామపై 290 పేజీల డాక్యుమెంట్‌ను స్పీకర్‌కు అందజేశామన్నారు. వారం రోజుల్లోనే రఘురామకు నోటీసులు వస్తాయని భావిస్తున్నామని తెలిపారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున చర్యగా ఫిర్యాదు చేశామన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా గుర్తుపై విజయం సాధించిన రఘురామకృష్ణంరాజు పార్టీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనేది స్పష్టంగా సాక్ష్యాలు ఉన్నాయన్నారు. ఇందుకు సంబంధించి సుమారు 290 పేజీలతో…
ఆంధ్రప్రదేశ్‌లో క్రమంగా కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 81,763 శాంపిల్స్ పరీక్షించగా.. 2,567 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 18 మంది కరోనా బాధితులు ప్రాణాలు వదిలారు.. తాజా మృతుల్లో గుంటూరులో నలుగురు, చిత్తూరు, నెల్లూరులో ముగ్గురు చొప్పున, తూర్పు గోదావరి, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇద్దరు చొప్పున, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు కన్నుమూశారు. ఇక, ఇదే…
ఏపీ సీఎం రాజ్యాంగ అతీతుడిలా వ్యవహరిస్తున్నారు అని అన్నారు మాజీ మంత్రి కళా వెంకట్రావ్. హైకోర్టు ఎన్ని మొట్టికాయలు వేసినా ఈ ప్రభుత్వానికి సిగ్గురావడం లేదు. ఈ ప్రభుత్వానికి ఓటు వేసినందుకు ప్రజలు సిగ్గుపడుతున్నారు. దున్నపోతు మీద వాన కురిసినట్లే ఉంది ప్రభుత్వ వైఖరి. ఆరువేల కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టారు. గతంలో దూరంగా ఉండి మా నిరసన తెలిపేవాళ్లం. ఈరోజు కలెక్టరేట్ గేటు వరకూ వచ్చాం…రేపు కలెక్టర్ ఆఫీస్ వరకూ వెళ్తాం. ఎన్నికలు దగ్గరపడితే…
ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది.. దాదాపుగా నామినేటెడ్ పదవుల ఎంపిక ఓ కొలిక్కివచ్చిందని… రేపే నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రకటన వస్తుందని ప్రచారం సాగుతోంది.. బుధవారం రోజు 60 నుంచి 70 వరకు కార్పొరేషన్లకు ఛైర్మన్లను ప్రకటించే అవకాశం ఉండగా.. గత ఎన్నికల్లో ఓటమిపాలైన, పలు కారణాలతో టికెట్ పొందని వారికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నారన వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్… ఇప్పటి వరకు ప్రముఖంగా వినిపిస్తున్న కొన్ని పేర్లను పరిశీలిస్తే..…
ఇప్పుడు చేస్తున్న అవినీతికి కోర్టులు కూడా చాలవు అంటూ సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. గుంటూరు జిల్లా చింతలపూడి వెళ్లిన ఆయన.. సంగం డెయిరీ కేసులో అరెస్టై.. జైలుకి వెళ్లొచ్చిన టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను పరామర్శించారు.. పార్టీ పూర్తి అండగా ఉంటుందని చెప్పారు.. అనంతరం మీడియాతో మాట్లాడిన టీడీపీ అధినేత.. రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం నరేంద్రది.. ఆయన తండ్రి నుండి ఇక్కడి ప్రజలకు, సంగండైరీ రైతాంగానికి…
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా ఉండగా… ఈశాన్య అరేబియా సముద్రంలో గుజరాత్ తీరానికి సమీపంలో మరో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. వీటన్నిటి ప్రభావంతో దాదాపు దేశమంతటా చురుగ్గా రుతుపవనాలు. కోస్తాంధ్ర తెలంగాణల్లో రానున్న 24 గంటల్లో చెదురుమదురుగా వర్షాలు.. కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉంది. నేడు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే ప్రమాదముంది. సముద్రతీరం అల్లకల్లోలంగా…
తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం రోజురోజుకీ ముదురుతోంది.. ఓ వైపు మాటల యుద్ధం.. మరోవైపు ప్రధానికి, కేంద్ర మంత్రులకు, కృష్ణానది యాజమాన్య బోర్డుకు లేఖలు.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో ఫిర్యాదుల వరకు వెళ్లింది.. ఇప్పుడు కృష్ణజలాల వివాదంపై సుప్రీంకోర్టుకువెళ్లే యోచనలో ఉంది ఏపీ సర్కార్… సుప్రీంలో పిటిషన్ దాఖలుకు కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.. అంతర్రాష్ట్ర నదులపై ఉన్న ప్రాజెక్టులను, విద్యుత్ కేంద్రాలను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించాలని, నిర్వహణ, భద్రత బాధ్యతలను కేంద్ర బలగాలకు అప్పగించాలని, తక్షణమే…
కృష్ణా జిల్లా: ఏపీకిమరో 3.72 లక్షల కరోనా టీకా డోసులు తరలివచ్చాయి. పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి కొవిషీల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి..ఢిల్లీ నుంచి చేరుకున్న ఎయిర్ ఇండియా విమానంలో 32 బాక్సుల్లో రాష్ట్రానికి తరలివచ్చాయి టీకా డోసులు.. తొలుత గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి వ్యాక్సిన్ ను తరలించారు అధికారులు. read also : తెలకపల్లి రవి : వరస ఎన్నికలకు బిజెపి ఆరెస్సెస్ రెడీ, మోడీ ఇమేజి కోసం మొహాల…
మైనింగ్ అక్రమాలపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. సహజ వనరుల దోపిడీపై ఫిర్యాదు రావడంతో… విశాఖలో క్వారీలపై తనిఖీల కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. డ్రోన్లు, జీపీఎస్ ఆధారిత సర్వే ద్వారా అక్రమాల గుర్తించి.. ఇష్టారాజ్యంగా జరుగుతున్న గనుల తవ్వకాలకు చెక్ పెట్టనున్నారు. అనకాపల్లిలోని ఓ మైనింగ్ కంపెనీ కార్యకలాపాలపై విచారణ జరపనుంది సీఐడీ. గనులశాఖ విజిలెన్స్ కూడా ఇప్పటికే భారీగా జరిమానాలు విధించింది. విశాఖలోని వందల క్వారీలు.. కనీస నిబంధనలు కూడా పాటించడం లేదని నిర్ధారించారు.…