ఢిల్లీకి పయనం అవుతుంది బీజేపీ ఏపీ టీమ్… రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలో.. హస్తినకు వెళ్లనున్నారు పార్టీ నేతలు.. మూడు రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేయనున్న నేతలు.. పలువురు కేంద్ర మంత్రులను కలవడంతో పాటు.. పార్టీ పెద్దలతో కూడా సమావేశం కానున్నారు.. ఈ పర్యటనలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలసి ఏపీ ఆర్ధిక పరిస్థితులపై ఫిర్యాదు చేయనున్నారు సోము వీర్రాజు.. ఇక, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర…
శ్రీశైలం డ్యామ్‌కు క్రమంగా వరద తగ్గుతూ వస్తోంది… ఇన్‌ఫ్లో 3 లక్షల క్యూసెక్కుల దిగవకు పడిపోయింది.. అయినా.. ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు… ఇన్ ఫ్లో 2,83,141 క్యూసెక్కులుగా ఉండగా… ఔట్ ఫ్లో 3,65,487 క్యూసెక్కులుగా ఉంది… ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 883.60 అడుగులుగా ఉంది… పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు…
తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం కొనసాగుతూనే ఉంది… కృష్ణా జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ దాదాగిరి చేస్తుందంటూ వ్యాఖ్యానించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. అయితే, ఆయన వ్యాఖ్యలపై స్పందిస్తూ కౌంటర్ ఎటాక్‌కు దిగారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి… నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. కృష్ణా జలాల వివాదం ఎవరు సృష్టించారో అందరికీ తెలుసు అన్నారు.. ఇక, దాదాగిరి ఎవరు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారన్న సజ్జల… కేంద్ర జలశక్తి శాఖ…
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదని ఇప్పటికే స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం.. అయితే, విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అంటూ సాధించుకున్న ఈ పరిశ్రమ ప్రైవేటీకరణకు ఒప్పుకునేది లేదంటున్నాయి అన్ని పార్టీలు.. విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం ఉద్యమాన్ని ఉధృతం చేశాయి… విశాఖ నుంచి ఇప్పుడు ఆందోళన ఢిల్లీ వరకు చేరింది… బీజేపీ మినహా అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలు.. ఈ ఆందోళనలో పాలుపంచుకుంటున్నాయి.. అయితే, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంపై…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టినా.. కేసులు ఒకరోజు ఎక్కవగా.. మరో రోజు తక్కువగా వెలుగుచూస్తున్నాయి.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో 59,641 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 1,546 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 15 మంది కరోనాతో మృతిచెందారు.. ఇక, ఇదే సమయంలో 1,968 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ఇవాళ్టి వరకు రాష్ట్రవ్యాప్తంగా పరీక్షించిన శాంపిల్స్…
గత శుక్రవారం అంటే జూలై 30న ఐదు సినిమాలు విడుదలయ్యాయి. అందులో ‘తిమ్మరుసు’కు మంచి టాక్ వచ్చింది. కానీ థియేటర్లను పుల్ చేసేంత మాస్ అప్పీల్ హీరో సత్యదేవ్ కు లేకపోవడంతో కలెక్షన్లు ఓ మాదిరిగానే ఉన్నాయి. అలానే ఈ సినిమాతో పాటు విడుదలైన ‘ఇష్క్’కు నెగెటివ్ టాక్ వచ్చింది. దాంతో ఎవరూ ఆ మూవీ గురించి చర్చించడం లేదు. ఇక ఈ రెండు సినిమాతో పాటు వచ్చిన మరో మూడు సినిమాల గురించి కూడా జనాలు…
టీడీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్… ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలుగుదేశం పార్టీ.. తెలుగు దొంగల పార్టీగా మారింది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.. కొండపల్లి మైనింగ్ పై తెదేపా నేత పట్టాభి ఆరోపణలను ఖండించిన ఆయన.. అబద్దాలను నిజం చేయాలని తెదేపా నేతలు, పట్టాభి ప్రయత్నాలు చేస్తున్నారని.. లోయ గ్రామంలో లేని 143 సర్వే నెంబర్ ను వైఎస్ హయాంలో సృష్టించారని పట్టాభి ఆరోపించారని.. 1993లో ఒక వ్యక్తి దరఖాస్తు…
తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం కొనసాగుతూనే ఉంది… లేఖలు, ఫిర్యాదులు, ఆరోపణలు, విమర్శలు.. ఇలా చివరకు విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది.. ఈ నేపథ్యంలో కీలక సూచనలు చేశారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. జల వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారానే పరిష్కరించుకోవాలన్నారు సీజేఐ.. తెలుగు రాష్ట్రాల మధ్య కలహాలు వద్దన్న ఆయన.. అంతేకాదు మూడోపక్షం జోక్యం అవాంఛనీయం అన్నారు. కృష్ణా జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్ని వివాదంపై విచారణలో భాగంగా…
పదో తరగతి పరీక్షలు ఫలితాల వెల్లడికి ఫార్ములా రూపకల్పన కోసం నియమించిన హైపవర్ కమిటీ సిఫార్సులను ఆమోదించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కోవిడ్ కారణంగా పరీక్షలు రద్దు కావటంతో ఫలితాలను వెల్లడికి అనువైన విధానంపై నివేదిక ఇచ్చింది హైపవర్ కమిటీ. 2020, 2021 పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల వెల్లడికి హైపవర్ కమిటీ రూపొందించిన ఫార్ములాను ప్రభుత్వం ఆమోదించింది.. 2019-2020 విద్యా సంవత్సరానికి గ్రేడ్లు ప్రకటించేందుకు నిర్ణయం తీసుకుంది సర్కార్.. 2020లో పాస్ సర్టిఫికెట్లు ఇచ్చిన వారందరికీ…
పార్లమెంట్ లోపల, బయట విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ప్రకటించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ సభ్యులు మిథున్‌రెడ్డి… విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ధర్నాకు సంఘీభావం తెలిపిన ఆయన.. పరిరక్షణ కమిటీ పోరాటంలో పాలు పంచుకుంటామని తెలిపారు.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తామని గుర్తుచేసిన ఆయన.. స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల ఆత్మభిమానం అని పార్లమెంట్ లో స్పష్టం చేశామన్నారు.. ఇక, స్టీల్ ప్లాంట్‌కు గనులను కేంద్ర…