హైదరాబాద్ నుంచి వికారాబాద్ వెళ్తున్న బెల్గావ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇంజన్ లో మంటలు చెలరేగాయి. శంకర్ పల్లికి చేరుకోగానే స్టేషన్ మాస్టర్ మంటలను గమనించి లోకోపైలట్ ను అప్రమత్తం చేశాడు. వెంటనే లోకోపైలట్ ట్రైన్ ను నిలిపివేశాడు. ఫైర్ సిలిండర్ తో మంటలను ఆర్పేశాడు లోకోపైలట్. పైలెట్ అప్రమత్తతతో ప్రమాదం తప్పినట్లైంది. బ్రేక్ జామ్ అవడంతో నిప్పురవ్వలు చెలరేగినట్లు రైల్వే అధికారులు తెలిపారు. మంటలు ఆర్పిన అనంతరం నిపుణుల సూచనల మేరకు రైలు బయలుదేరింది. సురక్షితంగా వికారాబాద్ కు చేరుకుంది. ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చకున్నారు.