Trinamool MLA: తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మిత్రా ‘శ్రీరాముడు’ గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ‘‘శ్రీరాముడు హిందువు కాదు, ముస్లిం’’ అని ఆయన చేసిన కామెంట్స్‌పై బీజేపీ తీవ్రంగా మండిపడుతోంది. బీజేపీ నేత ప్రదీప్ భండారి ఎక్స్‌లో ఈ వ్యాఖ్యలకు చెందిన వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో కమర్‌హతి ఎమ్మెల్యే అయిన మదన్ మిత్రా ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ, శ్రీరాముడి మత గుర్తింపు గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కనిపిస్తుంది.
Read Also: Telangana MLAs Defections Case: రేపు సుప్రీం కోర్టులో తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ
ఈ వీడియోను షేర్ చేస్తూ.. ‘‘తృణమూల్ పార్టీ ఇంతగా దిగజారిపోయింది… హిందూ విశ్వాసాలపై రోజువారీ దాడులు, హిందూ మతాన్ని, బెంగాలీ ప్రజల సంప్రదాయాలను అపహాస్యం చేయడం. ఓటు బ్యాంకును ప్రసన్నం చేసుకోవడానికి చౌకబారు రెచ్చగొట్టే చర్యలు… అదే (ముఖ్యమంత్రి) మమతా బెనర్జీకి ఉన్న ఏకైక ప్రాధాన్యత’’ అని భండారీ అన్నారు. ‘‘ప్రభు శ్రీరాముడు హిందువు కాదు, ముస్లిం’’ అని టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మిత్రా చేసిన ఈ దారుణమైన వ్యాఖ్య హిందూ మతాన్ని ఉద్దేశపూర్వకంగా అవమానించడమే అని బీజేపీ మండిపడుతోంది.
అయితే, ఈ వ్యాఖ్యలపై మదన్ మిత్రా స్పందించారు. ఇది 2024 నాటి పాత వీడియో అని, దీనిని బెంగాల్ ఎన్నికల ముందు బీజేపీ ఉద్దేశపూర్వకంగా తీసుకువచ్చిందని, ఈ క్లిప్‌ను ఎడిట్ చేసి ప్రచారం చేస్తోందని, వీడియో మొత్తాన్ని రిలీజ్ చేస్తే తాను ఆ వ్యాఖ్యలు చేయలేదనేది స్పష్టమవుతుందని ఆయన అన్నారు.
TMC MLA Madan Mitra’s outrageous claim that “Prabhu Sri Ram was a Muslim, not a Hindu” is a deliberate insult to Hindu faith.
This is what the TMC has degenerated into:
👉 Daily attacks on Hindu beliefs
👉 Mocking Hindu faith and traditions of Bengal’s people
👉 Cheap… pic.twitter.com/94Iwum4DPo
— Pradeep Bhandari(प्रदीप भंडारी)🇮🇳 (@pradip103) December 18, 2025