శ్రీశైలం డ్యామ్‌కు క్రమంగా వరద తగ్గుతూ వస్తోంది… ఇన్‌ఫ్లో 3 లక్షల క్యూసెక్కుల దిగవకు పడిపోయింది.. అయినా.. ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు… ఇన్ ఫ్లో 2,83,141 క్యూసెక్కులుగా ఉండగా… ఔట్ ఫ్లో 3,65,487 క్యూసెక్కులుగా ఉంది… ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 883.60 అడుగులుగా ఉంది… పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 207.8472 టీఎంసీలుగా ఉందని అధికారులు వెల్లడించారు.. మరోవైపు.. కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.. మరోవైపు.. శ్రీశైలం నుంచి కృష్ణమ్మ నాగార్జునసాగర్ వైపు పరుగులు తీస్తుండడంతో.. సాగర్ గేట్లను సైతం ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు.. అవి ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి వదులుతున్నారు.