కృష్ణానది జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి… ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారు.. ఈ నేపథ్యంలో.. కృష్ణానది యాజమాన్యబోర్డు (కేఆర్ఎంబీ) రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించాల్సి ఉంది.. అయితే.. ఆ పర్యటన వాయిదా పటినట్టు ప్రకటించింది కేఆర్ఎంబీ.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాల నేపథ్యంలో పర్యటన వాయిదా పడిందని అధికారులు వెల్లడించారు. మళ్లీ ఎప్పుడు పరిశీలన చేసేది తర్వాత వెల్లడిస్తామని కేఆర్ఎంబీ తెలిపింది. కాగా, ఏపీ ప్రభుత్వం అనుమతులు లేకున్నా.. రాయలసీమ…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. కృష్ణ నది జలాలతో పాటు.. గోదావరి జలాల విషయంలోనూ కొన్ని వివాదాలు ఉండగా… ఈ వివాదాలకు తెరదించాలన్న ఉద్దేశంతో… రెండు బోర్డుల అధికారాలు, పరిధిలను నిర్ణయిస్తూ.. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.. అయితే, దీనిపై భిన్నమైన వాదనలు ఉన్నాయి.. ఈ నేపథ్యంలో.. ఈనెల 9వ తేదీన గోదావరి నది యాజమాన్య బోర్డు పూర్తిస్థాయి అత్యవసర సమావేశం జరగనుంది… కేంద్ర జనశక్తి మంత్రిత్వ…
నూతన విద్యా విధానంపై అందరిలోనూ అవగాహన తీసుకురావాలని.. ఈ విధానం ద్వారా తీసుకు వస్తున్న విప్లవాత్మక మార్పులు వల్ల పిల్లల సంఖ్యకు తగినట్టుగా టీచర్ల ఉంటారని తెలిపారు ఆంధ్రప్రదేశ్ సీఎం కవైఎస్ జగన్.. క్యాంపు కార్యాలయంలో ఇవాళ నూతన విద్యావిధానంపై సమీక్ష నిర్వహించిన ఆయన.. నూతన విద్యా విధానంలో స్కూళ్లను ఆరు రకాలుగా వర్గీకరించాలని ఖరారు చేశారు.. స్టూడెంట్, టీచర్ రేష్యో పై తయారు చేసిన ప్రతిపాదనలను సీఎంకు వివరించిన అధికారులు.. శాటిలైట్ స్కూల్స్ ( పీపీ–1,…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గినట్టే తగ్గి.. మళ్లీ భారీగా పెరిగాయి.. ఇదే సమయంలో టెస్ట్‌ల సంఖ్య కూడా పెంచారు. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 85,822 శాంపిల్స్ పరీక్షించగా.. 2,442 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 16 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో.. 2,412 మంది బాధితులు కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. తాజా మృతుల్లో చిత్తూరులో ఐదుగురు, అనంతపురం, కృష్ణా, నెల్లూరు…
ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయంగా వచ్చిన దేశీయ ‘కూ’(Koo) యాప్ కు ఇప్పుడిప్పుడే యూజర్లు వస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ‘కూ’ యాప్ ను ప్రోత్సహిస్తూ జాయిన్ అవుతున్నారు. కాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ‘కూ’ యాప్ లో జాయిన్ అయ్యారు. యూజర్లకు మాతృభాషలో సంభాషించేందుకు వీలు కల్పిస్తున్న కారణంగా ముఖ్యమంత్రి జగన్ ఈ యాప్ లో చేరినట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీఎంఓ ఆంధ్రప్రదేశ్ మరియు ఏపీ డిజిటల్ కార్పొరేషన్…
కరోనా కల్లోలం సృష్టిస్తున్న సమయంలో.. మందు తయారు చేసి వార్తలఎక్కారు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య… అయితే, కరోనా థర్డ్ వేవ్ కూడా మందు తయారు చేస్తానంటున్నారు ఆనందయ్య… థర్డ్ వేవ్ లక్షణాలు చూసి తర్వాత.. దానికి కూడా మందు తయారు చేయనున్నట్టు వెల్లడించారు.. మరోవైపు.. నా మందుకు ఇక పేరు పెట్టను అని ప్రకటించారాయన… ఎందుకంటే.. ఆనందయ్య మందుగానే అది అందరికీ పరిచయం అయ్యిందని.. ఇక పేరు పెట్టాల్సిన అవసరం లేదన్నారు ఆనందయ్య. ఎవరు…
అమర రాజా ఫ్యాక్టరీ వ్యవహారం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారిపోయింది… ఈ వ్యవహారంపై స్పందించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. అమర రాజా ఫ్యాక్టరీని వెళ్లిపొమ్మని మేం చెప్పలేదన్నారు.. తిరుపతిలో ఓ ప్రైవేట్ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టు, కాలుష్య నియంత్రణ మండలి లేవనెత్తిన అభ్యంతరాలను సరి చేసుకుని అమర రాజా ఫ్యాక్టరీ ఇక్కడే కొనసాగవచ్చు అన్నారు.. ఇక, పరిశ్రమలు తరలిపోవాలని మేం కోరుకోం అని స్పష్టం చేశారు.…
రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు రేపు పర్యటించనుంది. ఎత్తిపోతల వద్ద పనులు జరుగుతున్నదీ లేనిదీ తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ బోర్డును ఇప్పటికే ఆదేశించింది. తొలుత తెలంగాణ అక్రమంగా నిర్మిస్తున్న పథకాలను చూసి రావాలని ఆంధ్రప్రదేశ్ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్జీటీ ఆదేశాల మేరకు పర్యటించి నివేదిక సమర్పించాలని కేఆర్ఎంబీ నిర్ణయించింది. ఐతే..బోర్డు పూర్తిస్థాయి సమావేశం ఏర్పాటు చేయకుండా నిర్ణయం తీసుకునేందుకు వీల్లేదని ఏపీ అభ్యంతరం…
ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతూనే ఉంది. ఎవరూ ఎక్కడా తగ్గడం లేదు. తగ్గితే పరపతి పోయినట్టే అనుకుంటున్న ఈ ఇద్దరు నేతలు ఢీ అంటే ఢీ అంటూనే ఉన్నారు. ఇద్దరి మధ్య సయోధ్య కోసం హైకమాండ్ చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదు. విబేధాలు ఇలాగే కొనసాగితే పార్టీకి ఇబ్బందులు తప్పవా? ఇంతకీ ఎవరు వారు? ఎమ్మెల్యేగా గెలిచాక హఫీజ్‌ఖాన్.. ఎస్వీని దూరం పెట్టారా? కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే…
ఆ జిల్లాలో అధికారపార్టీ నేతల మధ్య ‘బుసక’ చిచ్చుపెట్టింది. పక్కపక్క నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న వారిలో ఒకరు మంత్రిగా ఉంటే మరొకరు ఎమ్మెల్యే. ఎన్నికలకు ముందు ఉన్న సఖ్యత ఇప్పుడు లేదట. ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్లినా అంటీముట్టనట్టు ఉంటోన్న వీళ్ల వ్యవహారం చర్చగా మారింది. వాళ్లెవరో.. ఆ బుసకేంటో.. ఈ స్టోరీలో చూద్దాం. ఇద్దరి మధ్య దూరం పెంచిన ‘బుసక’..! కృష్ణాజిల్లా గుడివాడ నుంచి వరసగా నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచి సీఎం జగన్ తొలి కేబినెట్లోనే మంత్రయ్యారు…